టి20 వరల్డ్ కప్.. ఫైనల్ వెళ్ళేది ఆ రెండు జట్లేనట?

praveen
అందరూ ఎదురు చూస్తున్న టి20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా వేదికగా ఈనెల 16వ తేదీన ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి రోజు నుంచి ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతూ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది అని చెప్పాలి. అయితే వరల్డ్ కప్ కు సంబంధించి ప్రకటన విడుదల అయిననాటి నుంచి ఇక నేటి వరకు కూడా ఎంతోమంది మాజీ ఆటగాళ్ళు వరల్డ్ కప్ కు సంబంధించి ఎప్పటికప్పుడు తమ రివ్యూలను ఇస్తూనే ఉన్నారు. ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే వరల్డ్ కప్ లో ఏ జట్టు బాగా రాణిస్తుంది. ఇక వరుస విజయాలతో ఫైనల్ వరకు ఏ జట్టు వెళ్తుంది.. ఫైనల్ లో టైటిల్ విజేతగా ఏ జట్టు నిలుస్తుంది అనే విషయంపై ఇక తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ రివ్యూలతో ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నారని చెప్పాలి.

 ఇకపోతే ఇక ఎప్పుడూ క్రికెట్ మ్యాచ్ లపై తనదైన శైలిలో కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో తన పోస్టులతో హాట్ టాపిక్ గా మారిపోయే భారత లెజెండ్రీ క్రికెటర్ సునీల్ గావాస్కర్ మరోసారి ఇక టి20 ప్రపంచ కప్ లో ఎవరు గెలుస్తారు అనే విషయంపై స్పందిస్తూ తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు అని చెప్పాలి. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో భారత జట్టు ఎంతో బలంగా కనిపిస్తుంది అంటు సునీల్ జవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే భారత జట్టు తప్పకుండా ఫైనల్ కు వెళుతుంది అంటూ ధీమా వ్యక్తం చేసాడు సునీల్ గావాస్కర్. అదే సమయంలో ప్రస్తుతం ఆస్ట్రేలియాలో టి20 వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో ఇక అక్కడి స్వదేశీ పరిస్థితిలు ఆస్ట్రేలియా జట్టుకు ఎంతగానో కలిసి వస్తాయని.. అదే సమయంలో ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు కూడా పటిష్టంగా కనిపిస్తుందని తద్వారా ఇక ఆస్ట్రేలియా జట్టు కూడా భారత్తో పాటు ఫైనల్ కు వెళ్తుంది అంటూ జోష్యం చెప్పాడు సునీల్ గవాస్కర్. అయితే గవాస్కర్ అభిప్రాయంతో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడి కూడా ఏకీభవించడం గమనార్ధం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: