యూపీఐ పని చేయకపోతే.. ఎవరైనా ఇలా చేస్తారా?

praveen
ఇటీవల కాలం లో చిన్న చిన్న కారణాలకే ఉన్మాదులుగా మారి పోతున్న మనుషులు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు లోకి వస్తున్నాయి. ఏకంగా మారనాయుధాలతో తిరుగుతూ ఎవరైనా ఎదురు మాట్లాడిన లేకపోతే.. ఇంకేదైనా కారణం తో చివరికి దారుణం గా దాడులకు పాల్పడుతూ ఉండడం కూడా నేటి రోజుల్లో చూస్తూనే ఉన్నాము. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. సాధారణం గా ఎక్కువ మంది పెట్రోల్ బంకు లో పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 ఇక్కడ ఓ యువకుడు కూడా పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళాడు. అందరి లాగానే యూపీఐ పేమెంట్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే యూపీఐ పేమెంట్ మాత్రం అక్కడ పని  చేయలేదు. దీంతో ఈ చిన్న కారణానికే బైక్ పై వచ్చిన యువకుడు వీరంగం సృష్టించాడు. యూపీ ట్రాన్స్ఫర్ కాకపోవడంతో బంక్ నిర్వాహకులు పెట్రోల్ కొట్టినందుకు గాను నగదు ఇవ్వాలని అడిగారు. తన వద్ద నగదు లేదని యూపీఐ ట్రాన్స్ఫర్ కావడం లేదని చెప్పడం తో పెట్రోల్ బంక్ సిబ్బందికి అతనికి మధ్య వాగ్వాదం జరిగింది.

 దీంతో కోపం తో ఊగి పోయిన యువకుడు తన వద్ద ఉన్న తుపాకీని బయటకు తీసి అందరినీ కూడా భయాందోళనకు గురి చేశాడు. అంతే కాదు క్యాషియర్ పై దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మరో ఇద్దరికి ఫోన్ చేసి పెట్రోల్ బంకు వద్దకు పిలిపించుకున్నాడు. ఇక ఆ ఇద్దరితో కలిసి బంక్ కార్యాలయాన్ని మొత్తం ధ్వంసం చేశాడు. చివరికి ఎంతో చాకచక్యం గా వ్యవహరించిన బంకు సిబ్బంది తుపాకి కలిగి ఉన్న ఇఫ్తికర్ ను పట్టుకున్నారు. దీంతో మరో ఇద్దరు పరారయ్యారు. ఇక పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే అక్కడికి చేరుకున్న బహదూర్పురా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: