అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్ కు.. స్టార్ క్రికెటర్ పేరు?

praveen
సాధారణంగా క్రికెట్ మైదానాలకు ఎంతోమంది దిగ్గజ ఆటగాళ్ల పేరు పెట్టే సంప్రదాయం ఎన్నో రోజుల నుంచి కొనసాగుతూ వస్తుంది. తమ దేశం తరఫున క్రికెట్ లో ఎంతగానో సేవలు అందించి లెజెండరీ క్రికెటర్ గా ఎదిగిన వారి పేర్లు ఇక మైదానాలకు పెడుతూ ఉంటారు. ఇక ఇప్పటి వరకు భారత్ లో ఇలాంటి స్టేడియాలు చాలానే ఉన్నాయి. అయితే భారత లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పేరును అటు విదేశాలలోని మైదానాలకు కూడా పెట్టి అరుదైన గౌరవం ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కాగా ఇక్కడ మైదానానికి ఆస్ట్రేలియా లెజెండరీ  క్రికెటర్ పేరు పెట్టారు. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

 దివంగత ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ జ్ఞాపకార్థం టౌన్స్ విల్లే సిటీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది అని తెలుస్తోంది.. టౌన్స్ విల్లే లోని రివర్ వే అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్ పేరును లెజెండరీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ స్టేడియంగా మార్చుతూన్నట్లు ఇటీవలే ప్రకటించింది.  కాగా ఆస్ట్రేలియా తరపున ఎన్నో ఏళ్ల పాటు క్రికెట్ లో సేవలు అందించిన  సైమండ్స్ టౌన్స్ విల్లే లోనే జన్మించాడు అన్న విషయం తెలిసిందే. ఇక తన నేతృత్వంలో ఎంతో మంది యువ ఆటగాళ్లను కూడా ఇదే స్టేడియంలో తీర్చిదిద్దాడని స్టేడియం నిర్వాహకులు తెలిపారు.

 ఈ క్రమంలోనే ఈ స్టేడియంలో ఆండ్రూ సైమండ్స్ పేరు శాశ్వతంగా నిలిచిపోవాలని అనే ఉద్దేశంతో స్టేడియం కు ఆండ్రూ సైమండ్స్  పేరును పెడుతూ నిర్ణయం తీసుకున్నట్లు టౌన్స్ వీళ్ళే  సిటీ కౌన్సిలర్ చెప్పుకొచ్చారు. స్టేడియం వేదికగా ఇప్పటివరకు హాంకాంగ్ పాపువా న్యూ గినియా మధ్య 2  అంతర్జాతీయ మ్యాచ్లు మాత్రమే జరిగాయి.  ఆగస్టు ఆఖరిలో ఆస్ట్రేలియా జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కూడా ఈ స్టేడియంలో జరగబోతుంది. కాగా ఈ ఏడాది మే నెలలో రోడ్డు ప్రమాదంలో ఆండ్రూ సైమండ్స్ మరణించి అభిమానులందరినీ కూడా దిగ్భ్రాంతిలో ముంచేశాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: