వారెవ్వా.. జేమ్స్ అండర్సన్ అరుదైన రికార్డు?

praveen
ప్రస్తుతం టీ20 వన్డే ఫార్మాట్ లు వచ్చి ప్రాబల్యం తగ్గిపోయింది కానీ ఒకప్పుడు మాత్రం టెస్ట్ ఫార్మాట్ ప్రపంచ క్రికెట్లో అగ్రస్థానంలో ఉండేది అనే విషయం తెలిసిందే. అంతేకాదు ఇక సుదీర్ఘమైన ఫార్మట్ గా పిలుచుకునే ఫార్మట్  ప్రతి ఆటగాడికి కూడా తన ప్రతిభకు సవాల్ విసురుతూ ఉంటుంది. నిరంతరాయంగా సుదీర్ఘ సమయంపాటు బౌలింగ్ చేయడం బ్యాటింగ్ చేయడం లాంటివి చేయాల్సి ఉంటుంది ఎంతో మంది ఆటగాళ్లు. అందుకే ఇటీవలి కాలంలో అటు టి20 ఫార్మాట్ కి బాగా క్రేజ్ పెరిగిపోయింది. అయినప్పటికీ ఎక్కువ మంది ఆటగాళ్లు టెస్ట్ లలో కొనసాగడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు.

 ఈ క్రమంలోనే ఇక టెస్టు ఫార్మాట్లో కొంత మంది ఆటగాళ్లు అరుదైన రికార్డులు నమోదు చేయడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఇటీవల టెస్ట్ ఫార్మాట్ క్రికెట్ లో అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో కీలక సమయంలో టామ్ లాథమ్  ను అవుట్ చేశాడు జేమ్స్ అండర్సన్. ఈ క్రమంలోనే తన టెస్ట్ కెరియర్ లో 650 వికెట్లను సాధించడం గమనార్హం.  ఇప్పుడు వరకు అంతర్జాతీయ క్రికెట్ లో 650 వికెట్లు పడగొట్టిన మూడవ బౌలర్గా జేమ్స్ అండర్సన్ ప్రత్యేకమైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి.

 అయితే టెస్టు ఫార్మాట్లో ఈ అరుదైన రికార్డు సాధించిన బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్,  మురళీధరన్ తొలి రెండు స్థానాల్లో ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే ప్రస్తుతం జేమ్స్ అండర్సన్  సాధించిన అరుదైన రికార్డు గురించి ప్రపంచ క్రికెట్లో ప్రేక్షకులు అందరూ కూడా చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. ఎన్నో ఏళ్ల నుంచి టెస్టు ఫార్మాట్లో కొనసాగుతున్న జేమ్స్ అండర్సన్ వయసు పెరుగుతున్నప్పటికీ యువ బౌలర్లకు  పోటీ ఇస్తున్న అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకుంటున్నాడు. తన ఫిట్నెస్ కాపాడుకుంటూ అద్భుత ప్రదర్శనతో అందరికీ షాక్ ఇస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: