వావ్.. సెంచరీల వీరుడు బట్లర్ లో ఈ టాలెంట్ కూడా ఉందా?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ప్రతి జట్టు ఖాళీ సమయం దొరికింది అంటే చాలు ఎంతో సరదాగా గడపడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలోనే డ్యాన్స్ లు చేయడం ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు చాహల్ జోస్ బట్లర్ డాన్స్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం జోస్ బట్లర్ భీకరమైన పామ్ లో కొనసాగుతూ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉంటే అటు ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా చాహల్ పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు అనే విషయం తెలిసిందే.

 భీకరమైన ఫాంలో కొనసాగుతున్న జోస్ బట్లర్ 10 మ్యాచులు ఆడి వేగంగా 588 పరుగులు చేశాడు. ఇక మరోవైపు చాహల్ 10 మ్యాచుల్లో 19 వికెట్లు తీసి టాప్ లో కొనసాగుతున్నాడు. ఇక పటిష్టంగా ఉన్న రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ పై కన్నేసింది. అయితే ఇటీవలే బట్లర్ చాహల్ కలిసి ఒక సాంగ్ పై అదిరిపోయే స్టెప్పులు వేశారు. డాన్సింగ్ టు బల్లే బల్లే అనే పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. బట్లర్ స్లో మూమెంట్స్ తో క్యూట్ గా చేయగా.. చాహల్ మాత్రం మాస్ డాన్స్ చూపించాడు. దీనికి సంబంధించిన వీడియో రాజస్థాన్ రాయల్స్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ మారింది.

 ఇక ఈ వీడియో చూసి ఫాన్స్ అందరు ఫిదా అవుతున్నారు అని చెప్పాలి. మైదానంలో బౌలర్లపై విరుచుకుపడి సెంచరీలు చేయడమే కాదు జోస్ బట్లర్ లో అటు అదిరిపోయే డాన్స్ చేసే టాలెంట్ కూడా దాగి ఉందా అని ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేస్తూ ఉన్నారు ఎంతోమంది అభిమానులు. అది సరే కానీ ఇంతకీ ఈ పాటకు కొరియోగ్రఫీ చేసింది ఎవరో తెలుసా.. ఇంకెవరో కాదు చాహల్ భార్య యూట్యూబర్ ధనశ్రీ..  నా మోస్ట్ ఫేవరెట్ రీల్.. మై ఫేవరెట్.. లవ్ అంటూ ధనశ్రీ ఇక ఈ వీడియో పై కామెంట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: