రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ పై వేటు?

VAMSI
ఇప్పటి వరకు బీసీసీఐ సారథ్యంలో 14 ఐపిఎల్ సీజన్ లు ఎంతో సక్సెస్ ఫుల్ గా జరిగాయి. ప్రస్తుతం ఇంకో 10 రోజుల్లో 15 వ సీజన్ స్టార్ట్ కానుంది. ఇప్పటి కే ఐపిఎల్ 15 కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఎప్పటిలాగా కాకుండా ఈ సారి ఐపిఎల్ ట్రోఫీ కోసం 10 జట్లు సమరంలో పాల్గొనబోతున్నాయి. అంతే కాకుండా ఈ సారి జట్లు అన్నీ కూడా కొత్త కొత్త ప్లేయర్స్ ను కొనుగోలు చేసుకుని కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాయి. కాగా ఈ సారి పంజాబ్, కోల్కతా మరియు బెంగళూర్ జట్లు కొత్త కెప్టెన్ కను ప్రకటించి అభిమానులలో మరింత ఉత్సాహాన్ని రేపాయి.

ఐపిఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా టైటిల్ కొట్టని జట్లు ఈ సారైనా కప్ గెలవాలని లక్ష్యంగా చేసుకున్నారు. ఇదిలా ఉంటే మరో పది రోజుల్లో సీజన్ స్టార్ట్ కానుండగా, ఇప్పుడు ఐపిఎల్ మొదటి విజేత రాజస్థాన్ రాయల్స్ తమ అభిమానులకు గట్టి షాక్ ఇచ్చింది. గత రెండు సీజన్ లుగా రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఇండియా క్రికెటర్ మరియు కీపర్ అయిన సంజు శాంసన్ పై వేటు వేసింది. ఈ విషయం స్వయంగా రాజస్థాన్ రాయల్స్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియచేయడం గమనార్హం. అయితే ఇతని స్థానంలో కొత్త కెప్టెన్ గా ఇండియా స్పిన్ మాంత్రికుడు యజ్వెంద్ర  చాహల్ ను నియమించింది. ప్రస్తుతం ఈ వార్త క్రీడా ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది
అయితే దీనికి ఇది కూడా ఒక కారణం అని తెలుస్తోంది. సంజు శాంసన్ కెప్టెన్ గా ఉంటూ ఎక్కువగా ఒత్తిడి తీసుకుంటున్నాడని అందుకే బ్యాటింగ్ లో విఫలం అవుతున్నాడని  జట్టు యాజమాన్యం భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఏ మతలబు ఉందో తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: