టోర్నీ నుండి 4 గురు ముంబై ప్లేయర్స్ అవుట్...

VAMSI
గత రెండు సంవత్సరాలుగా ప్రపంచాన్ని పట్టి పీడించి ఏదో కొంత కాలం ఉపశమనం దొరికింది కదా అనుకుంటున్న తరుణంలో మళ్ళీ కరోనా థర్డ్ వేవ్ వస్తుంది అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఇంకా పూర్తి స్థాయిలో కరోనా వదిలిపోలేదు. కాబట్టి అన్ని రంగాలలోనూ అనుమతులు లభించడంతో ఎప్పటి లాగే పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగానే మళ్ళీ మనపై పంజా విసిరేందుకు వస్తోందని తెలుస్తోంది. అయితే ఈ రోజు సమాచారం ప్రకారం ముంబై క్రికెట్ టీం కు చెందిన నలుగురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.
ఐపీఎల్ నుండి కరోనా భారత్ ఆటగాళ్లను ఇబ్బంది పెడుతోన్న విషయం తెలిసిందే. కానీ బీసీసీఐ తీసుకున్న జాగ్రత్తల కారణంగా పెద్ద నష్టమేమీ జరగలేదు. ఎలాగూ మిగిలిన ఐపీఎల్ షెడ్యూల్ ను కొద్దీ రోజుల క్రితమే యూఏఈ లో పూర్తి చేశారు. కాగా వచ్చే నెల 4 వ తేదీ నుండి ఇండియాలో సయ్యద్ ముస్తాక్ అలీ టీ 20 టోర్నమెంట్ జరగనుంది. ఇందుకు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ రోజు ముంబై జట్టు గౌహతి కి వెళుతున్న సందర్భంలో వీరిని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో పరీక్షించగా వారిలో నలుగురు కోవిడ్ బారిన పడినట్లు తెలిసింది.
వీరిలో సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ సోలంకి, సాంస్ ములాని మరియు సాయి రాజ్ పాటిల్ ఉన్నారు. వెంటనే వీరి నలుగురిని ఒక వారం రోజుల పాటుగా క్వారంటైన్ లో ఉండాల్సిందిగా ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా తెలిపింది. అంతే కాకుండా వీరిని జట్టు నుండి తప్పించి వీరి స్థానంలో మిగతా వారిని పంపించనుంది. కాగా ఈ ముంబై జట్టుకు అజింక్య రహానే కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. దీనితో ఒక్కసారిగా ముంబై ఉలిక్కిపడింది వీరితో గత కొద్ది రోజులుగా ఎవరెవరు టచ్ లో ఉన్నారు అనే విషయంపై దృష్టి పెట్టనుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: