టీ 20 వరల్డ్ కప్: బంగ్లాదేశ్ కి చావో రేవో?

VAMSI
గత మూడు రోజుల నుండి జరుగుతున్న పొట్టి ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ లు ఎంతో ఆసక్తికరంగా సాగుతున్నాయి. గ్రూప్ ఏ లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో ఐర్లాండ్ చేతిలో నెదర్లాండ్ దారుణమైన ఓటమిని చవిచూసింది. ఇక మరో మ్యాచ్ లో శ్రీలంక నమీబియాను ఓడించి సూపర్ 12 కు వెళ్ళడానికి ఒక అడుగు ముందుకు వేసింది. ఈ రోజు ఇంకాసేపట్లో గ్రూప్ బి నుండి జరగనున్న మ్యాచ్ తో ఒక అంచనాకు రాగలము. మధ్యాహ్నం జరిగిన మరో మ్యాచ్ లో స్కాట్లాండ్ వరుసగా రెండవ విజయాన్ని నమోదు చేసి సూపర్ 12 కు వెళ్ళడానికి ఇంకొక అడుగు దూరంలో నిలిచింది. 

కాగా గ్రూప్ బి నుండి క్లియర్ గా స్కాట్లాండ్ క్వాలిఫైయర్ చేరినట్లే, ఇక రెండవ స్థానం కోసం బంగ్లాదేశ్ మరియు ఒమన్ జట్ల మధ్యన పోటీ ఉండనుంది. ఇప్పటికే ఆతిధ్య ఒమన్ మొదటి మ్యాచ్ లో న్యూ గినియాను చిత్తు చేసి విజయోత్సాహంతో బరిలోకి దిగనుంది. ఇక అనుకోని విధంగా పసికూన స్కాట్లాండ్ చేతిలో ఓటమి పాలయిన బంగ్లాదేశ్ ఒత్తిడితో ఈ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో కనుక ఒమన్ గెలిస్తే గ్రూప్ బి నుండి ఒమన్ మరియు స్కాట్లాండ్ లు సూపర్ 12 కు అర్హత సాధిస్తాయి. ఒకవేళ అలా కాకుండా బంగ్లాదేశ్ కనుక గెలిస్తే మరో మ్యాచ్ వరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఒక్కొక్కరు మూడు మ్యాచ్ లు ఆడనున్నారు. ఇప్పటికి స్కాట్లాండ్ 2, న్యూ గినియా 2, ఒమన్ 1 మరియు బంగ్లాదేశ్ 1 మ్యాచ్ లు ఆడి ఉన్నాయి.

కనీసం రెండు మ్యాచ్ లు గెలిచిన జట్టు క్వాలిఫైయర్ రేసులో ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్ అటు ఒమన్ ఇటు బంగ్లాదేశ్ లకు చాలా ముఖ్యం. బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలి అనే కసితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ బంగ్లా టైగర్స్ కు చావో రేవో అన్న విధంగా ఉంది. ఇక మొదటి మ్యాచ్ లో ఆకట్టుకున్న ఒమన్ ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను నిలువరిస్తుందా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: