రేప‌టి నుంచే టీ ట్వంటి వ‌ర‌ల్డ్ వార్

Dabbeda Mohan Babu
ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు అల‌రించే పోట్టి ఫార్మెట్ వ‌ర‌ల్డ్ కప్ రేప‌టి నుంచే ప్రారంభ కానుంది. క్రికెట్ అభిమానుల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఎంట‌ర్ టైన్ చేసిన ఐపీఎల్ ముగిసిన త‌ర్వాత కొన్ని రోజుల్లో నే ఈ టీ ట్వంటి వ‌ర‌ల్డ్ క‌ప్ పండుగ జ‌రుగుతుంది. ఈ మ‌హా సంగ్రామం కోసం క్రికెట్ అభిమాను ల‌తో పాటు క్రికెట్ ఆట‌గాళ్లు కూడా ఐదేళ్ల నుంచి ఎదురు చుస్తున్నారు. వాస్త‌వానికి ఈ మెగా టోర్ని గ‌తం లోనే మొద‌లు కావాల్సింది. కానీ ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోన వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు వాయిదాలు ప‌డుతూ వ‌చ్చింది. నిజానికి ఈ మ‌హా సంగ్రామం ఇండియా లో జర‌గాల్సింది. కానీ భార‌త దేశంలో ప్ర‌తి రోజు క‌రోన కేసులు విప‌రీతం గా పెర‌గ‌డం తో దుబాయ్ తో పాటు ఓమ‌న్ లో నిర్వ‌హిస్తున్నా రు. కానీ ఈ కప్ ప్ర‌తినిథ్యం వ‌హించేది మాత్రం బీసీసీఐ.


ఐదేళ్ల త‌ర్వాత  మ‌ళ్లి జర‌గుతున్న ఈ మెగా టోర్ని అక్టోబ‌ర్ 17 నుంచి జ‌రుగబోతుంది. మొద‌టి రోజే డ‌బుల్ హెడ‌ర్ తో క్రికెట్ అభిమానుల‌ను ఉత్స‌హ ప‌ర‌చ‌డానికి సిద్ధంగా ఉంది. ఈ నెల 17 న జ‌ర‌గ బోయే మొద‌టి మ్యాచ్ లో ఒమ‌న్ జ‌ట్టు తో పాపువా న్యూ గినియా  జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది. అలాగే మ‌రో మ్యాచ్ లో బంగ్లాదేశ్ టీం తో స్కాట్లాండ్ జ‌ట్టు ఢీ కోట్ట నుంది. ఈ సంగ్రామంలో టీమిండియా అక్టోబ‌ర్ 24  న దాయాది దేశ మైన పాకిస్థాన్ తో అమి తూమి చూడ‌నుంది. అలాగే ఈ మెగ టోర్ని ఫైన‌ల్ మ్యాచ్ న‌వంబ‌ర్ 14 న జ‌ర‌గ నుంది. అయితే ఈ మ హా సంగ్రామ మ్యాచ్ లు చూడ టానికి ఆ దేశ ప్ర‌భుత్వాలు అనుమ‌తి ని కూడా ఇస్తున్నాయి. దుబాయ్  తో పాటు ఒమ‌న్ ల‌లో ఉన్న స్టేడియాల్లో కరోనా రూల్స్ ను పాటిస్తూ అభిమానుల‌ను అనుమ‌తించ నున్నారు. అలాగే ఈ మ్యాచ్ ల‌ను ప్ర‌తి రోజు భార‌త దేశ కాల‌మాన ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 3:30 గంట‌ల‌కు,  రాత్రి 7:30 గంట‌ల‌కు స్టార్ స్పోర్ట్స్ ఛాన‌ల్ ల‌లో ప్ర‌త్యేక్ష ప్ర‌సారం కానున్నాయి.మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: