ఇంటి నుండి ఆడపిల్లలు ఈ వస్తువులు ఇవ్వకూడదు..?

Divya
సనాతన ధర్మం ప్రకారం ఒక్కో వస్తువుకి ఒక్కొక్క రకమైన ప్రాధాన్యత ఉంటుంది. మనం ఇంటి ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేటప్పుడు చీర చారలను పెడుతుంటాము. కానీ వాటిలో కొన్ని వస్తువులను మన ఇంటి నుంచి వియ్యంకులు వారింటికి అసలు పంపించకూడదు.వాటి వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి వెళ్లిపోయి ఆర్థిక సమస్యలు మొదలయ్యే అవకాశాలు ఉంటాయని వేద పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఉప్పు..
పొరపాటున కూడా మన ఇంటి ఆడపిల్లలకు ఉప్పు మన ఇంటి నుంచి పంపించకూడదు. సాధారణంగా ఉప్పును లక్ష్మీదేవికి ప్రతి స్వరూపంగా భావిస్తాము.అలాంటి ఉప్పును ఆడపిల్ల అత్తవారింటికి అస్సలు పంపించకూడదు.దీనివల్ల మన ఇంట్లో ఆర్థిక సమస్యలు మరియు గొడవలు మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
చింతపండు..
ఆడపిల్లకు ఇవ్వకూడని వస్తువుల్లో చింతపండు కూడా ఒకటి.చింతపండు ఆడపిల్లకు ఇవ్వడం,వల్ల మనకి వారికి తగాదాలు అవుతాయని పెద్దలు చెబుతూ ఉంటారు.కావున వారితో సంబంధాలు మంచిగా ఉండాలి అంటే చింతపండును అసలు పంపించకూడదు.
దూది..
దూదితో మనము ఒత్తులు చేసుకొని దీపారాధన చేసుకుంటూ ఉంటాము.అది మన ఇంటికి ఏంతో శుభసూచికం.ఇలాంటి వస్తువును మన ఇంటి ఆడపిల్లకు అసలు ఇచ్చి పంపించకూడదు.దీనివల్ల మన ఇంటి శుభాలు అన్ని తరిగిపోయి దరిద్రం ఆవహించే అవకాశం  ఉంది.
పరకలు..
మనం ఇల్లును శుభ్రం చేసుకునే చీపుర్లను లక్ష్మీ దేవిగా భావిస్తూ ఉంటారు.ఈ చీపుర్లను దాటడం కానీ, ఒకరికి చేత్తో ఇంకొకరికి ఇవ్వడం కానీ చేయ కూడదు.ఇలా చేస్తే మనకు వారికి గొడవలు అవుతాయి.అంతేకాక లక్ష్మిదేవిగా భావించే చీపుర్లను ఆడపిల్లకు ఇచ్చి పంపిస్తే మన ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంటుంది.
పాలు, పెరుగు..
పాలు,పెరుగు మన ఇంటి నుంచి ఆడపిల్ల అస్సలు తీసుకు పోకూడదు.ఇలాంటి వస్తువులు తీసుకుపోతే, వారి ఇంట్లో దరిద్రం అవహించి,వారు వృద్ధిలోకి రారని, కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి.కావున అందరికి శ్రేయస్సు కొరకు ఇలాంటి వస్తువులు ఆడపిల్లకు ఇవ్వకపోవడం చాలా ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: