రంజాన్ పండుగ గురించి తెలియని మరికొన్ని విషయాలు..

Divya

పండుగ  అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే, సంస్కృతిని, జాతీయతను నేర్పుతుంది. పండుగ  మానావాళికి హితాన్ని బోధిస్తుంది. ఇక ప్రస్తుతం ముస్లింల విషయానికి వస్తే , ముస్లిం లు అత్యంత పవిత్రంగా జరుపుకునే "రంజాన్ "  పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి బోధిస్తుంది. ముస్లింలు చాంద్రమాన కేలండర్ ను  అనుసరిస్తారు. చాంద్రమానా  ఇస్లామీయ కేలండర్ ప్రకారం తొమ్మిదవ నెల "రంజాన్ " పండుగగా జరుపుకుంటారు. అంతేకాదు దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం "దివ్య ఖురాన్ "గ్రంథం. ఈ మాసంలో అవిర్భవించింది కాబట్టి. అంతేకాకుండా స్వర్గం నుండి భువికి దిగి వచ్చింది కూడా ఈ రోజే అని పెద్దలు చెప్తారు.  క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే  ఈ రంజాన్ మాసం..

ఇప్పటికే రంజాన్ మాసం ఏప్రిల్ 14వ తేదీన మొదలై,  మే 12 తో ముగుస్తుంది. అయితే నెలవంక కనిపించని కారణంగా గురువారం నాడు చివరిరోజు గా ప్రకటించి, శుక్రవారం రోజున ఈ పండుగను జరుపుకుంటున్నారు. అయితే కరోన సెకండ్ వేవ్ ఉద్రిక్తత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇంట్లో ఉంటూనే రంజాన్ వేడుకలు జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. అంతే కాకుండా భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించాలని కూడా స్పష్టం చేశాయి.

ముఖ్యంగా చెప్పాలి అంటే, ప్రపంచంలోని ప్రతి ముస్లిం 5 ప్రాథమిక విధులను తప్పకుండా పాటించాలి. అయితే అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
నమాజ్ : ఎనిమిది సంవత్సరాలు దాటిన వారు తప్పకుండా 5సార్లు నమాజ్ చేయాలి.
ఇమాన్ : భగవంతుడైన అల్లాహ్ పై మనస్ఫూర్తిగా దృష్టిపెట్టి నమాజ్ చేయడం నేర్చుకోవాలి.
రోజా : ఉపవాస దీక్ష పాటించడం. ఉపవాసాన్ని అరబ్బీ లో సౌమ్ అని, ఉర్దూలో రోజా అని పిలుస్తారు. ఇక ఇస్లాంలో రోజా అంటే సూర్యోదయం నుంచి సంధ్య సాయంకాలం వరకు ఆహార పానీయాలు సేవించకుండా మనోవాంఛలకు దూరంగా ఉండడం.
జకాత్ : దీనినే సద్క అని కూడా పిలుస్తారు. తమ స్తోమతను బట్టి నిర్దేశించిన స్థాయిలో ఇతరులకు దానం చేయడం. అంటే 2/5 వ వంతు తమ వార్షిక ఆదాయం లో ఇతరులకు దానాలు తప్పకుండా చేయాలి.
హజ్: ప్రతి ముస్లిం తమ జీవితంలో  మక్కా మసీదు ను తప్పకుండా సందర్శించాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: