చెరువు నిండినoదుకు జనం సంబరాల మోత..??

Sravani Manne
చెరువు నిండినందుకు జనం సంబరాలు చేసుకోవడo ఏంటి అనుకుంటున్నారా అవును అండి.ఈ సంఘటన తెలంగాణాలోని సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.అసలే కుండ పోత వర్షాలతో అటు తెలంగాణా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన జీవనం అస్త వ్యస్తం అవుతుంది.అటు చెరువుల వల్ల ఒక ఊరి నుండి ఒక ఊరికి చేరుకోవడమే చాల కష్టంగా ఉంటుంది.అలా ఈ వర్షానికి సిరిసిల్ల జిల్లాలో వాగుని దాటుతూ అందులో బస్సు ఇరుక్కుపోయన 25 మందిని కాపాడటానికి ప్రజలు చాలా కష్టపడాల్సి వచ్చింది.


అంతే కాకుండా ఈ వర్షానికి జరిగిన రోడ్డు ప్రమాదాల్లో కూడా చాలమంది తమ ప్రాణాలను పోగొట్టుకున్న విషయాలు చూస్తూనే ఉన్నాం.మాములుగా చిన్నగా కురిసే వర్షానికే గట్లు తెగిపోయిన సందర్బాలు చూస్తూనే ఉన్నాం.చెరువు నిండిపోయి పంటను కూడా ముంచి వేయటం చూస్తూనే ఉన్నాం.అలాంటిది ఈ ఊరి ప్రజలు చెరువు నిండినoదుకు సంబరాలు చేసుకుంటూ అందరు డాన్సులు కూడా చేస్తున్నారు.


అంతే కాకుండా ఈ వర్షానికి ఇదే జిల్లాలో బైకులతో కొట్టుకు పోయిన వారు ఉన్నారు.అంతేకాక ట్రాక్టర్లు సైతం నీళ్ళలో కొట్టుకు పోయిన సందర్బాలు చూస్తున్నాo. అలాంటిది ఈ ఊరి ప్రజలు చెరువు నిండినoదుకు సంబరాలు చేసుకుంటూ అందరు డాన్సులు కూడా చేయటం చూసే వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది.అసలు ఊరి ప్రజలకు ఎందుకు ఇలా సంబరాలు చేసుకుంటున్నారు అనే దాని మీద ప్రజలు చర్చ జరుపుతున్నారు.ఈ చెరువు 50 ఏళ్ల తరవాత ఇప్పుడే నిండింది అని అందుకే ప్రజలు పండుగ చేసుకుంటున్నారు అని కొందరు అంటున్నారు.మరికొందరు తెలంగాణాలో ఇప్పటి వరకు వర్షాలు పడటం వల్లే పంటలు పండేవి అసలు కొన్ని ప్రాంతాలలో వర్ష పాతం సరిగా పడని కూడా పడదు.అలాంటి ప్రాంతం అయి ఉంటుంది అని కొందరు అంటున్నారు.ఏది ఏమి అయిన ఇలాగా చెరువు నిoడటం,దానికి ఆనందంలో సంబరాలు చేసుకోవడo ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: