సెటైర్: ఓహో పవన్ మళ్లీ అదే ప్రకటనా ? త్యాగమూర్తివయ్య ..??!!

ప్రశ్నించడానికే పార్టీ అని చెప్పినా, పవర్ కోసం కాకపోతే ఇంకేందుకు రాజకీయం అనే సూక్తి చెప్పి ...ఏ ఎప్పుడూ మీరేనా ..? మేము పాలించకుడదా అని గోంతెత్తినా, సీఎం అని గట్టిగా అరవండి అంటూ ఫ్యాన్స్ కి హితబోధ చేసినా, జగన్ రెడ్డి అన్నా, పాచిపోయిన లడ్డూ అన్నా ..! అసలు ఎవరిని ఎన్ని తిట్టినా.. ఎన్ని రకాలుగా పొగిడినా ..ఎలా బడితే అలా రాజకీయం చేయడంలో పవన్ కళ్యాణ్ కు ఎవరూ సాటి రారు. లక్షలాది మంది అభిమానులు, ప్రధాన సామాజిక వర్గం మద్దతు అన్నీ ఉన్నా పవన్ రాజకీయంగా సక్సెస్ కాలేకపోవడనికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్ గా తిరుపతి ఎన్నికల విషయానికి వచ్చేస్తే అక్కడ జన సేన పోటీ చేస్తుందా లేక బిజెపి పోటీ చేస్తుందో ఇంకా క్లారిటీ లేదు. ఎన్నికల నామినేషన్ వేసే వరకు వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. కాకపోతే అటు బిజెపి, ఇటు జనసేనాని మాత్రం చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.అసలు మీ రెండు పార్టీలో ఎవరు పోటీ చేస్తారో చెప్పండయ్యా అంటూ మీడియా మసాలా అద్దడానికి రెఢీ అయిపోయినా, అబ్బే పెదవే విప్పడం లేదు.





పోన్లే ఎవరు పోటీ చేస్తే ఏంటి అనుకుని వదిలేసినా , పవన్ వ్యవహారం చూస్తే మళ్లీ త్యాగమూర్తి పాత్ర పోషించేందుకు రెఢీ అయిపోయినట్టు గా కనిపిస్తున్నారు. నిన్న జరిగిన పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం లో దీనిపైనా చర్చ గట్టిగానే జరిగిందట. పవన్ సార్.. పవన్ సార్ తిరుపతిలో మనమే పోటీ చేద్దాం  సార్. అనే డిమాండ్స్ వచ్చినా అబ్బే పవన్ సార్ మాత్రం అబ్బే కంగారు పడకండిరా అబ్బాయిలు.




 ఎప్పటి లాగే మనమూ త్యాగాలే చెయ్యాలోయ్ అన్నట్టుగా మాట్లాడేశారట. మీరు కంగారు పడకండి బిజెపి జన సేన కూటమి అభ్యర్ధే రంగంలో ఉంటాడు.. మరో వారంలో డిసైడ్ చేసేద్దాం అనేసరట. కానీ సైనికులు మాత్రం .. మీరు ఎప్పుడూ ఇలాగే చివరి వరకు ఆశపెట్టి బిజెపి వొళ్ళ కోసం త్యాగం చేసేస్తారు తొండి అంటూ మారం చేసేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: