మంచిమాట: తప్పు చేయకపోయినా ఆలోచన వస్తే తప్పు చేసినట్టే..!!

Divya

గద్వాల్ రాజ్యంలో వెంకయ్య పట్టు చీరల వ్యాపారం చేస్తుండేవాడు. ఓసారి చీరలు అమ్ముతూ చాలా దూరం వెళ్లడం వల్ల  సకాలంలో ఇంటికి చేరలేకపోయాడు. వెంకయ్యది ఊరి చివర ఇల్లు..జన సంచారం చాలా తక్కువ.. చీకటిపడిన వెంకయ్య ఇంట్లో వెలుగులేకపోవడం చూసి దొంగ ఒకడు ఆ ఇంట్లో దూరి నగలు డబ్బులు దొంగలించాడు. కాసేపటి తరువాత వెంకయ్య ఇంట్లోకి మరో దొంగ వెళ్ళాడు. విలువైన వస్తువులు లేవి కనిపించక పోయేసరికి  వెంకయ్య సంపన్నుడని చెప్పుకోగా విన్నాడా దొంగ ..ఇంట్లో ఏదో చోట డబ్బు దాచి ఉంటాడని ఒక మూలగా గునపంతో తవ్వటం మొదలు పెట్టాడు. చాలా సేపు తవ్విన అతడికి ఏమీ దొరకలేదు.
 
అంతలో వెంకయ్య ఇంటికి వచ్చాడు. తలుపు తీసి ఉండటం చూసి చప్పుడు చేయకుండా లోపలికి వచ్చి చూశాడు. దొంగని  వెంకయ్య గమనించి బయటకువెళ్లి గడియ పెట్టి రాజభటుల్ని తీసుకొచ్చాడు. భటులు ఆ దొంగను బంధించారు. ఇంట్లో చూసుకుంటే డబ్బు నగలు కనిపించలేదు వెంకయ్య కి.. రాజభటులు ఎంత అడిగినా తానేమి తీయలేదని చెప్పాడు దొంగ.. అతన్ని రాజు దగ్గరికి తీసుకెళ్లారు భటులు
 
సరిగ్గా అప్పుడే వెంకయ్య ఇంట్లో నగలు దొంగలించిన మొదటి దొంగని రాజభటులు వేరేచోట పట్టుకొని విచారణకు తీసుకువచ్చారు. వెంకయ్య ఆ నగల్ని గమనించి తన ఇంట్లో వేనని అని చెప్పాడు. దొంగ వెంకయ్య చెప్పిన వివరాలు సరిపోయాయి. దీంతో రెండో దొంగ మాట్లాడుతూ.. రాజా దొంగ ఎవరో తెలిసింది కదా నాకే పాపం తెలియదు. ఇప్పటికైనా నన్ను విడిచిపెట్టండి. అని అన్నాడునువ్వు ఏ వస్తువు దొంగలించలేదన్నది నిజమే కావచ్చు.. కానీ దొంగలించాలనే ఉద్దేశంతోనే వెంకయ్య ఇంట్లోకి ప్రవేశించావు కాబట్టి దొంగతో సమానంగా నీకు శిక్షపడాల్సిందే ఆరేళ్ల కఠినకారాగార శిక్ష అని తీర్పు చెప్పాడు రాజు. కాబట్టి మనం తప్పు చేయకపోయినా సరే తప్పు చేయాలని పురమాయించుకుంటే  ఎప్పటికైనా శిక్ష తప్పదు. అందుకే తప్పు చేయాలనే ఆలోచన మన మనసులో కి కూడా రానివ్వకూడదు అని చెబుతారు పెద్దలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: