మంచిమాట: తప్పు దోవలో డబ్బు సంపాదిస్తే కష్టాలు తప్పవు..!!

Divya
అనగనగా రామాపురం అనే ఒక గ్రామం ఉండేది..ఆ రామాపురం గ్రామంలో ఒక రోజు రాత్రి ఒక దొంగ పరిగెత్తుకుంటూ వచ్చి షావుకారు దుకాణంలో దూరాడు..ఇక వెంటనే షావుకారు నన్ను రక్షించండి .. నా ప్రాణం కాపాడండి అంటూ మొదలు పెట్టాడు.. అలా ఆ జమిందారు ఇంట్లో దొంగతనం చేసి వస్తుండగా రాజభటుల కంట పడ్డాడు. భటులు ఈ తోవనే వస్తున్నారు. నన్ను వారి నుంచి రక్షిస్తే నేను దొంగలించిన డబ్బులో సగం మీకు ఇస్తాను అని చెప్పాడు. డబ్బుపై ఆశతో షావుకారు దొంగను రక్షించేందుకు ఒప్పుకున్నాడు.
తలుపు చాటున దాక్కుని దొంగకు సూచించాడు. ఆ తోవన వచ్చిన రాజభటులు దొంగ ఇటువైపు గాని వచ్చాడా. అన్నీ షావుకారిని ఆరాతీశాడు. ఎవరూ రాలేదని అబద్ధం చెప్పాడు షావుకారు.. దాంతో  భటులు దొంగను వెతుక్కుంటూ ఆ తోవన ముందుకు వెళ్ళి పోయారు.  భటులు వెళ్లిపోయాక ... దొంగని తన వాటా ఇమ్మంటు అడిగాడు షావుకారు.. ఇదిగో నీ వాటా తీస్తున్న అని సంచిలో నుంచి కత్తి , తాడు  తీశాడు దొంగ.. షావుకారి మెడపైన కత్తిపెట్టి.... నీకు బతకాలని ఆశ ఉంటే కేకలు వేయకు అని బెదిరించి.. అతడిని కుర్చీకి కట్టేసి దుకాణంలోని డబ్బుని కూడా సంచిలో వేసుకుని వెళ్ళిపోయాడు.
దొంగకు ఆశ్రయం కల్పించడం వల్ల తన డబ్బు పోయిందని లబోదిబో మన్నాడు ఆ  షావుకారు తాను నష్టపోయిన సొమ్ము గురించి రాజు గారికి ఫిర్యాదు చేస్తే.. దొంగకు సాయం చేసినందుకు తానే మళ్లీ చిక్కుల్లో పడాల్సి వస్తుందేమోనన్న భయంతో బయటకు చెప్పకుండా ఉండిపోయాడు. మరి ఇప్పుడు దుష్టులకు సాయం చేయకూడదని, తప్పు మార్గంలో డబ్బు సంపాదించాలని ఆశపడకూడదని బుద్ధి తెచ్చుకున్నాడు. కేవలం కథ విషయంలోనే కాదు నిజజీవితంలో కూడా ఏ ఒక్కరూ సంపాదించని డబ్బు కోసం ఆరాట పడకూడదు.. కష్టపడి సంపాదించిన ఒక రూపాయల సరే ఆనందాన్నిస్తుందని చివరకు ఆ షావుకారు తెలుసుకోవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: