మంచి మాట: అసలైన మంచితనం అంటే ఇదేనా..?
నేను మీ దగ్గరికి ఎవరిని తీసుకు రాలేను మీరే మారువేషంలో ప్రజల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. అని చెప్పాడు మంత్రి అయితే ఇద్దరం వెళ్దాం అన్న రాజు ప్రతిపాదనకు సరేనన్నాడు మంత్రి.రాజు మంత్రి మారువేషంలో గుర్రాలపై ఓ గ్రామానికి వెళ్లారు. గ్రామం మధ్యలో కొందరు కూలీలు భావి తవ్వుతూ వారికి కనిపించారు. ఇద్దరు కూలీల దగ్గరగా వెళ్లి బావి ఎవరు తవ్విస్తున్నారని అడిగారు. ఆ పక్కనే నిల్చున్న ఓ రైతు ముందుకు వచ్చి తానే ఆ బావి తవ్విస్తున్నట్లు చెప్పాడు. రాజు మంత్రి ఒకరు ముఖంలోకి ఒకరు చూసుకున్నారు. అంత డబ్బు నీకు ఎక్కడ నుంచి వచ్చింది. అని ఆ రైతుని అడిగాడు మంత్రి.
అయ్యా రెండేళ్ల పాటు మా ఊరిలో మంచి వర్షాలు కురిశాయి. పంటలు బాగా పండాయి మంచి లాభాలు వచ్చాయి. ఈ సంవత్సరం కరువు వచ్చింది. ఊరిలో ఒక బావి మాత్రమే ఉంది. ఆ నీళ్లు అందరికీ సరిపోవటం లేదు. నేను దాచుకున్న డబ్బుతో ఊరి ప్రజల కోసం బావి తవ్వి స్తున్నాను. అని చెప్పాడు రైతు నిజమైన మంచితనం దానం అంటే ఏమిటో అప్పుడు అర్థమయ్యింది రాజుకు.