మంచిమాట: ఎల్లప్పుడూ దుష్టులకు మనమే దూరంగా ఉండాలి..!!

Divya
ఒక అడవిలో ఒక సింహం ఉండేది అది కాలక్రమేణా వయసు పైబడి ముసలిది అయిపోయింది. వేటాడే శక్తి కూడా లేక.. ప్రతీ రోజు ఆహారం ఎలా సంపాదించాలా అనే ఆలోచనలో పడింది. బాగా ఆలోచించి ఒక నక్క ని పిలిచి, నీ తెలివి తేటలు,నీ చురుకుదనం గురించి చాలా విన్నాను.. నువ్వు నా ప్రధాన మంత్రి గా ఉండు..నాకు రోజు ఆహారం సంపాదించే పని నీకే ఇస్తాను. అంది.. అది విన్న నక్క మహారాజా! తప్పకుండా! ఈరోజు నుంచి మీకు ప్రతి రోజూ ఆహారం తెచ్చే పని నాదే అంటూ పొంగిపోయింది.
అదే పని మీద నక్క అడవిలో కొంత దూరం వచ్చి అక్కడ గడ్డి మేస్తున్న ఒక బలిసిన గాడిద ని చూసి నిన్ను మన వన రాజు సింహం పిలుస్తోంది. నిన్ను తన మంత్రిగా నియమిస్తుందట అని చెప్పింది గాడిద.. ఆశ్చర్యంగా నన్నా? ఎందుకు? అని అడిగింది. నువ్వు కష్టపడి బాగా పని చేస్తావు కదా మంత్రిగా నువ్వే ఉండాలట. ముందు త్వరగా రా అంది నక్క. గాడిద సరే అంటూ నక్క వెంట వెళ్లింది. గాడిద రావడం తోటే సింహం దాని పైకి ఎగబడింది. గాడిద బెదిరిపోయి పరుగు లంకించుకుంది వెంటనే నక్క స్వామి! మీరు దాన్ని భయపెట్టే సారు.. మళ్ళీ ప్రయత్నించి ఎలాగోలా తీసుకువస్తా అని చెప్పి ఎలాగో ఒప్పించి సింహం దగ్గరికి తీసుకు వచ్చింది.
ఈసారి సింహం గాడిదని చంపేసింది.. నక్క మహా జిత్తులమారి పైగా మంచి ఆకలి మీద ఉంది సింహంతో నక్క ఇలా అంది రాజా! నేను దీనికి కాపలాగా ఉన్నాను మీరు ముందు వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి రండి తరువాత హాయిగా తినొచ్చు అని అన్నది.  సింహం సరేనని శుభ్రంగా స్నానం చేసి నీళ్లు తాగి వచ్చేసరికి నక్క గాడిద తలలోని మెదడు ని తినేసింది. సింహం వస్తూనే నా ఆహారాన్ని ఎవరు తిన్నారు? దాని మెదడేది? అంటూ గట్టిగా గాండ్రించింది నక్క తెలివిగా రాజా! గాడిదకు మెదడేది? మెదడే ఉంటే ఆలోచించి మళ్ళీ మీ దగ్గరికి వచ్చేదా? అంది ..దానితో సింహం అంతే కదా అనుకుంటూ ఆకలి తీర్చుకో సాగింధి...ఎల్లప్పుడూ దుష్టులకు దూరంగా ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: