మంచిమాట : గురువు అంటే ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాదు..!!

Divya
అనగనగా నందగిరి అనే రాజ్యంలో మహేంద్రుడు అనే ఒక రాజు ఉండేవాడు..ఆ నందగిరి రాజు మహేంద్రడికి ఒకానొక సమయంలో తన గురువు వేదనాథుడు గుర్తుకు వచ్చాడు. గురువుగారి బోధన వల్లనే నేడు నేను విజయవంతంగా రాజ్య పాలన చేస్తున్నాననే ఆలోచన అతనిలో కలిగింది. గురువును సత్కరించడం విధిగా భావించి తాను విద్యను అభ్యసించిన గురుకులానికి వెళ్ళాడు. తన మనసులోని మాటను చెప్పి గురువు గారిని సగౌరవంగా సభకు ఆహ్వానించాడు. శిష్యుని కోరికను గురువు వేద నాధుడు కాదని అనలేకపోయాడు.
రాబోయే 'గురుపౌర్ణమి 'నాడు వస్తానని రాజుకి గురువు మాట ఇచ్చాడు. గురువు తాను చెప్పిన సమయానికి కొందరు శిష్యులతో కలిసి నందగిరికి బయలుదేరాడు.. వేద నాధుడు నంధగిరి కి వెళ్లేసరికి చీకటి పడింది. మహేంద్రుడు  తన సతీమణి పట్టపురాణితో కలిసి గురువుకు సాదర స్వాగతం పలికాడు. పాదపూజ అనంతరం వేదనాథుడిని అత్యంత ఉన్నతస్థానం పై కూర్చోబెట్టారు. రాజ దంపతులు ఓ పూలమాలను గురువుగారి మెడలో వేసి అలంకరించారు.
వెనువెంటనే పరివారం మొత్తం  ఒక పట్టు వస్త్ర మూటను ఆయన చేతిలో ఉంచారు.
ఏమిటిదీ అని అడుగుతూ ఆశ్చర్యపోతూ వేద నాధుడు అడిగాడు. నా ఉన్నతికి దోహదపడిన మీకు నా గురుదక్షిణ  గురువుగారు అని వినయంతో అన్నాడు. ఆ తర్వాత  మహేంద్రుడు చిరుకానుకే... దయచేసి స్వీకరించండి అంటూ మూట విప్పి చూపించింది రాజామహిషి బంగారు నాణెములు వజ్రవైడూర్యాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి  ఆ మూటలో..అందులో ఆ మూటను మహేంద్రనికే తిరిగిస్తూ ఒక గురువుగా.. ఇచ్చే గుణం తప్ప తీసుకొని ఎరుగను ప్రజల కోసం ఖర్చు చేసే ప్రతి పైసా కూడా  గురుదక్షిణగానే భావిస్తాను. నా అంతరంగం నీకు అర్థం అయిందని భావిస్తాను.
 అని గంభీరస్వరంతో చెప్పాడు వేద నాధుడు.. గురుపౌర్ణమి నాడు గురువు తనకో నూతన పాఠాన్ని బోధించాడని భావించిన మహేంద్రుడు ఆ సొమ్మును ప్రజల శ్రేయస్సు కొరకే వినియోగించడం మొదలు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: