మంచిమాట: స్నేహం, అభిమానం అనేది ఎవరో చెబితే కాదు మనసులో నుంచీ పుట్టాలి..!!

Divya
రామాపురంలో వెంకయ్య అనే ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. ఆయన ఆ ఊరి వారికే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలోని వారికి కూడా వడ్డీ లకు డబ్బు ఇచ్చేవాడు. అయితే అనందపురం అనే గ్రామం నుంచి ఏ ఒక్కరూ వెంకయ్య దగ్గరకు అప్పు కోసం వచ్చేవారు కాదు. ఒకసారి వెంకయ్య అనుకోకుండా ఆనందపురం వెళ్ళాడు. సహజంగా వ్యాపారానికి ఉండే కుతూహలంతో వెంకయ్య ఆ ఊరి స్థితిగతులను పరీక్షించాడు. అక్కడ అందరూ ఆనందంగా ఉన్నారు. ఒకరితో ఒకరికి గొడవలు లేవు .. ఎవరికైనా కష్టం వస్తే దాన్ని నలుగురు పంచుకుంటారు. ఏ సమస్యల్లేకుండా జీవిస్తున్నారు అందుకు కారణం ఏమిటని కూడా వెంకయ్య ఆరా తీశాడు.
ఒక వృద్ధురాలు చెబుతూ  కొంతకాలం క్రితం మా ఊరికి ఒక ముని వచ్చాడు. ఆయన మాకు కొన్ని పూల మొక్కలు ఇచ్చాడు. ఆ మొక్కలకి పూలు గుత్తులు గుత్తులుగా పూసేవి. ఒక పూల గుత్తిని మనం ఎవరికైనా ఇస్తే అది రెండింతలు అయ్యేది. అలా ఊరంతా అందరి ఇళ్లలోనూ ఆ పూల గుత్తులు ఉన్నాయి. అప్పటి నుంచి మేం చాలా ఆనందంగా ఉంటున్నాము అని చెప్పింది.
వెంకయ్యకి అసూయ కలిగింది. ఎలాగైనా ఆ ఊరిలోని వారందరికీ కష్టాలు వచ్చేటట్లు చేయాలనుకున్నాడు. ఒకరాత్రి రహస్యంగా తన మనుషులతో వారి దగ్గర ఉన్న పూల మొక్కలు వాటికి ఉన్న పూల గుత్తులను పీకేసి ఎవరికీ కనిపించకుండా దూరంగా పడేసాడు.
కొన్ని రోజుల తరువాత వెంకయ్య పనిగట్టుకునీ ఆనందపురం వెళ్ళాడు. ఏమీ తెలియనట్లు అందరినీ పరామర్శించాడు. మా ఊరి స్థితిగతులు మారిపోయి మనుషుల మధ్య గొడవలు కలిగి ఉంటాయని భావించాడు. వెంకయ్య కానీ అక్కడి పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదు.

ఆ ఊరి ప్రజలు మునుపటి కంటే ఇంకా ప్రేమ గా అభిమానంగా ఉన్నారు. ఒక్క క్షణం వెంకయ్యకు మతి పోయింది .ఆ తరువాత దానికి కారణం ఏమిటో వెంకయ్య బాగా ఆలోచించాడు. అతనికి ముని మహిమ ఏమిటో అర్థమయ్యింది . ఆ మహానుభావుడు అభిమానం స్నేహం ప్రేమ అనే పూలతోటలు ఇండ్ల లోగిళ్లలో కాదు జనాల మనుషుల్లో నాటాడు. మొక్క లాగే అవి దినదినాభివృద్ధి చెంది వారి హృదయం నిండి ఉన్నాయి..అందుకే బాహ్యంగా పెరిగిన మొక్కలు లేకపోయినా వారి మనసు ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇక ముందు మార్పు రాదు కూడా అని సత్యం బోధ పడ్డ వెంకయ్య ఇక ఆ వూరి జోలికి వెళ్లే ప్రయత్నం చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: