మంచిమాట: అల్పులతో సహవాసం అనేక ప్రమాదాలను తెస్తుంది..!!
ఒకరోజు ఆ అడవికి ఒక వేటగాడు వచ్చాడు. ఎంత ప్రయత్నించినా ఏమీ దొరకకపోవడంతో వెనుతిరిగి పోతూ కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని ఆ చెట్టు కింద ఆగాడు.. అలసిపోయి ఉండడంతో వేటగాడికి వెంటనే నిద్ర పట్టేసింది. అది వేసవి కాలం.. గాలి కూడా లేదు. అతనికి శరీరమంతా బాగా చెమట పట్టింది. మంచి స్వభావం కలిగిన హంస కొమ్మ మీద నిలబడి అతడికి తన రెక్కలతో విసరసాగింది. ఇంతలో అల్పబుద్ధి గల కాకి వచ్చింది. హంస చేస్తున్న పరోపకారం చూసి నవ్వింది.
వాడు వేటగాడు! మనల్ని బాణాలతో వేటాడుతాడు. వాడికి సేవ చేస్తున్నావు..నువ్వు ఎంత పిచ్చి దానివి అని ఎగతాళి చేసింది కాకి. అంతటితో ఆగకుండా ఆ కాకి నిద్రపోతున్న వేటగాడి పై రెట్ట వేసి ఆ వేటగాడి తల మీద తన్ని ఆ కాకి ఎగిరిపోయింది.
దాంతో ఆ వేటగాడికి నిద్రాభంగం కలిగింది. ఒంటి మీద ఉన్న రెట్ట చూశాడు. అతనికి బాగా కోపం వచ్చింది వెంటనే పైకి చూశాడు..అక్కడ ఆ కొమ్మ మీద హంస తప్ప అక్కడ మరో ప్రాణి కనిపించడం లేదు. తల మీద హంస రెట్ట వేసిందని అనుకున్నాడు వెంటనే తన బాణాన్ని హంసకు గురిచేసి వదిలాడు. ఆ బాణం దెబ్బకు హంస చనిపోయింది. వేటగాడు దానిని ఇంటికి వెళ్లిపోయాడు. కాబట్టి దుష్టులకి మనం దూరంగా ఉండడమే మంచిది. ఎంత దూరంగా ఉంటే అంత మనకే మేలు కాబట్టి చెడ్డ సావాసం ప్రాణానికి నష్టం. ఇక నుంచైనా ప్రతి ఒక్కరూ ఎవరి జాగ్రత్తలో వారు ఉంటే అందరికీ శుభం కలుగుతుంది.