మంచిమాట: మనసులో జాలి , ప్రేమ ఉంటే సరిపోదు.. దాన్ని చూపాలి..!!

Divya
కృష్ణాపురం గ్రామంలో కేశవానంద అనే స్వామీజీ ఉండేవాడు. ఓరోజు ఆయన దగ్గరికి రమణ అనే యువకుడు వచ్చాడు. రాగానే ఆయన కాళ్ళ పైన పడి అయ్యా! నాకు కోపం చాలా ఎక్కువ. మాటలు కటువుగా ఉంటున్నాయి. దాంతో అందరితోనూ పోట్లాడుతున్నాను. ఇంట్లోనే కాదు ఊర్లోనూ నన్ను అందరూ ద్వేషిస్తున్నారు. నేనేం చేయాలి? అని అడిగాడు.. అప్పుడు స్వామీజీ నీ కోపం తగ్గాలంటే నువ్వు మెడలో అసలైన పులిగోరు తీసుకోవాలి. మన పక్కనే ఉన్న అడవిలో ఓ ముసలి పులి ఉంది.

దాని దగ్గరకు వెళ్లి నేను పంపానని చెబితే అది నిన్నేమి చెయ్యదు.. వెళ్లి తెచ్చుకో! అన్నాడు.. ఆ తర్వాతి ఉదయమే కేశవ అడవికెళ్ళాడు. బక్కచిక్కిన ముసలి పులి దగ్గరకెళ్లి స్వామీజీ పేరు చెప్పాడు. దాంతో అదేమి చేయలేదు.. కానీ నాకు వయసైపోయింది. కాబట్టి వేటాడలేకపోతున్నాను. కాబట్టి నాకు ప్రతిరోజు ఆహారం తెచ్చిపెడితే.. గోరు ఇస్తాను! అని చెప్పింది అప్పటి నుంచి కేశవ ప్రతిరోజు దానికి మాంసం, చేపలు తీసుకెళ్ళడం మొదలుపెట్టాడు. రోజంతా దానితోనే ఉండేవాడు. కళ్ళు కూడా లేని , పైకి కూడా లేవలేని దాన్ని చూసి జాలిపడటం మొదలుపెట్టాడు.

దాన్ని ప్రేమగా దగ్గరికి తీసుకునేవాడు ఓ రోజు పులి కేశవతో నేను చనిపోయే సమయం వచ్చింది. చనిపోయాక నా గోళ్ళు తీసుకెళ్ళు! అనిచెబుతూ కళ్ళు మూసింది. కేశవ దాని మరణాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. స్వామీజీ దగ్గరకు వచ్చి ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు. ఒక జంతువు చనిపోయిందనే ఇంతలా ఏడుస్తున్నావు కదా! అదే సానుభూతిని , ప్రేమనీ నీ చుట్టూ ఉన్న మనుషుల మీద చూపించు కేశవా...! మనసులోపల ప్రేమా, జాలి ఉంటే సరిపోదు దాన్ని చూపాలి. అలా చూపడం మొదలుపెడితే నీ కోపము తగ్గుతుంది. నిన్ను అందరూ ప్రేమిస్తారు! అని చెప్పాడు.. అప్పటినుంచి కేశవ ఎదుటివాళ్ళ ఇబ్బందుల్ని పట్టించుకుంటూ సౌమ్యంగా మాట్లాడటం నేర్చుకున్నాడు... అందరి బంధువు అనిపించుకున్నాడు!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: