మంచిమాట: చెప్పే నోటి కన్నా సహాయం చేసే చేతులే మిన్న..!!

Divya
గౌరీపురంలో హేమంతుడు అనే ధనికుడు నివసిస్తూ ఉండేవాడు. అతనికి ఒక పెద్ద భవంతి, కోట్ల రూపాయలలో డబ్బు, బంగారం, ఖరీదైన వస్తువులతో పాటు వాహనాలు లెక్కలేనన్ని ఉండేవి.

అయితే దానధర్మాల విషయంలో మాత్రం అతను పరమ పిసినారి. ఎవరైనా ఏదైనా సహాయం అడగటానికి వస్తే.. హేమంతుడు మాత్రం  ఏవో సాకులు చెప్పి, ఆ  తర్వాత రమ్మని చెప్పేవాడు. సరే  తర్వాత రమ్మన్నారు కదా అని  వెళ్తే మళ్లీ ఇంకేదో కారణం చెప్పేవాడు. అంతేకానీ పైసా కూడా ఇచ్చేవాడు కాదు.అంత పరమ పిసినారి.. ఆ విధంగా హేమంతుడుకి ఊర్లో బాగా చెడ్డ పేరు వచ్చింది.
ఇక అదే ఊరిలో ప్రసన్నుడు అనే మరో వ్యక్తి ఉండేవాడు. అతడు హేమంతుడు లాగా  ధనవంతుడు కాకపోయినా ఉన్నంతలోనే.. ఇతరులకు తనకు తోచిన సాయం చేస్తుండేవాడు ప్రసన్నుడు. అడిగినవారికి లేదనకుండా తృణమో పణమో ఇస్తుండడంతో ప్రసన్ననుడిని ఆ వూరి ప్రజలు అందరూ మెచ్చుకునే వారు.
ఇది చూసి హేమంతుడికి ప్రసన్నుడు పై ఈర్ష్య కలిగింది. ప్రసన్నుడిని ఎలాగైనా సరే  హేమంతుడు ఒక ఉపాయం ఆలోచించాడు. "కొంతకాలం ఆగండి నేను.. నా ఆస్తి మొత్తాన్ని ఈ ఊర్లో బడి గుడి కట్టించడానికి దానధర్మాలకు ఇస్తాను"అని అందరినీ పిలిచి చెప్పడం ప్రారంభించాడు. అయినా సరే ఎవరూ పట్టించుకోలేదు.
ప్రసన్నుడు మాత్రం ఎప్పటిలాగానే అందరికీ సాయం చేస్తూ.. బడికి వెళ్లే పేద పిల్లలకు పలకలు ,బలపాలు ఉచితంగా ఇవ్వసాగాడు. అలాగే గుడికి వెళ్లే భక్తులకు ఉచితంగా ప్రసాదాలు పంచి పెట్టసాగాడు. ఒకరోజు ప్రసన్నుడికి ఊర్లో ఘనస న్మానం జరిగింది. "నా ఆస్తిని గుడికి, బడికి ఇస్తానంటే నాకు గాక అతనికి సన్మానం చేస్తారా?"అంటూ హేమంతుడు అందరినీ అడిగాడు "మీరు ఎప్పుడో ఇస్తానంటున్నారు.. ఆయన ఇప్పుడే ఇస్తున్నారు. అదీ తేడా "అన్నారు.. ప్రజలు.. దాంతో తన తప్పు తెలుసుకొని అప్పటి నుంచి ఉదారంగా ఉండసాగాడు ప్రసన్నుడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: