మంచిమాట : తెలివితో ఎటువంటి వారి నుంచి అయినా తప్పించుకోవచ్చు..

Divya
ఒక రోజున గోవింద్ కి వాళ్ళ నాన్న ఒక చిన్న వెండి పెట్టను ఇచ్చి, గోవిందా..! ఈ పెట్టెను తీసుకెళ్ళి , ప్రక్క ఊరిలో ఉన్న మీ మామయ్యకు ఇచ్చి, తిరిగి త్వరగా వచ్చేయ్.. నీవు తొందరగా బయలుదేరి వెళ్తే , మళ్లీ పొద్దుపోయే లోపు ఇంటికి రావచ్చు అని చెప్పాడు.
గోవిందు వెంటనే బయలుదేరి , రెండు గంటల్లో వాళ్ళ మామయ్య గారు ఇంటికి చేరుకున్నాడు .వాళ్ళ మామయ్యకు ఆ పెట్టను ఇచ్చాడు. వాళ్ళ అత్తయ్య గోవిందుకు పిండివంటలతో చక్కటి భోజనం పెట్టింది. కొంతసేపయిన తర్వాత వాళ్ళ మామయ్య వచ్చి ..నేను పెట్టెలోని వస్తువుల్ని తీసుకున్నాను.. ఇంకా నీవు తిరిగి తీసుకుని వెళ్లవచ్చునని,గోవిందుకు ఆ వెండి పెట్టేను ఇచ్చి, బాబు..! జాగ్రత్తగా వెళ్ళు.. దారిలో టక్కరి దొంగ లు ఉంటారు..అని చెప్పి గోవిందుని సాగనంపాడు.
కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎవరో దొంగ తన వెనకే వస్తున్న ట్లు గోవిందునికి అనుమానం వచ్చింది. ఏం చేయాలో తోచక, పరుగెత్తడం మొదలు పెట్టాడు. ఆ దొంగ కూడా పరిగెత్తడం మొదలు పెట్టాడు.. అంతలోనే ఒక గొయ్యి కనిపించింది గోవిందుడికి. కొంచెం నీళ్ళు త్రాగి వెళ్దామని నూతి దగ్గరకు వెళ్ళాడు.. దొంగ అంతకంతకూ గోవిందుడు దగ్గరికి వెళ్ళాడు.. వెంటనే గోవిందుడికి ఒక మెరుపులాంటి ఉపాయం తట్టింది..పెద్దగా అరుస్తూ.. అమ్మోయ్.. బాబోయ్ ..నేను ఇప్పుడు ఏం చేద్దాం రా దేవుడోయ్.. అని కేకలు వేయడం మొదలుపెట్టాడు..
గోవిందుడు దగ్గరికి దొంగ వచ్చి, ఏం బాబు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు.. వెంటనే గోవిందుడు నేను నీళ్లు  తాగుతుంటే నా చేతి ఉంగరం , బంగారం గొలుసు, వాచిbనూతిలో పడిపోయాయి. అవి లేకుండా ఇంటికి ఎట్లా వెళ్లాలి అన్నాడు. వెండి పెట్టే కంటే అవే మేలు బంగారం గొలుసు, ఉంగరం ,వాచి వాటినమ్ముకుంటే బోలెడంత డబ్బు వస్తుంది అని అనుకున్నాడు దొంగ..
అప్పుడు దొంగ బాబు..! నువ్వు ఇక్కడే ఉండు ..నేను నీ వస్తువులను పైకి తెస్తాను అని వెంటనే దొంగ నూతిలోకి దూకాడు.. నా ఆలోచన ఫలించింది.. ఇప్పుడు నేను వెండి పెట్టేతో క్షేమంగా ఇంటికి పోవచ్చు అని అనుకొని పరిగెత్తుకుంటూ ఇల్లు చేరాడు గోవిందుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: