మంచిమాట : నమ్మకాన్ని నిలబెట్టుకున్న వాడే నిజమైన మనిషి..

Divya
వీరాపురం అనే ఊర్లో రంగయ్య అనే మోతుబరి రైతు ఉండేవాడు. అతని దగ్గర ధనయ్య అనే అత్యాశ పరుడైన పని వాడు ఉండేవాడు. రంగయ్య అతన్ని ఎంతో బాగా చూసుకునేవాడు .అడిగిన దానికన్నా ఎక్కువ సొమ్ము వస్తువులు, ఇచ్చినా ఇంకా ఏదో కావాలని ఆశ పడుతూ అసంతృప్తితో గడుపుతుండే వాడు ధనయ్య.. అతని కళ్ళు ఎప్పుడు రంగయ్య డబ్బు దాచే పెట్టే.. పెట్టే మీదే ఉండేది. దాని తాళం చెవి ఎప్పుడెప్పుడు చిక్కుతుందా..?అంటూ చూస్తుండేవాడు.

ఎప్పుడు అందులోని డబ్బుతో హుడా ఇద్దామా అనుకుంటూ ఉండేవాడు. అప్పుడప్పుడు చిన్న చిన్న  దొంగతనాలు కూడా చేసేవాడు. కానీ రంగయ్య భార్య మాత్రం అతనిని ఒక కంట కనిపెడుతూ ఉండేది. భర్తను కూడా హెచ్చరించేది. కానీ రంగయ్య ఆమె మాటలు పట్టించుకునేవాడు కాదు .అయితే ఒకరోజు ఉన్నట్టుండి రంగయ్య దగ్గరికి వచ్చి.. ధనయ్య ఇలా అన్నాడు.. అయ్యా..! నేను పని మానేసి వెళ్ళిపోతాను. నేను ఎంత నిజాయితీగా పని చేస్తున్నా ,మీరు నన్ను పూర్తిగా నమ్మటం లేదు. అన్నాడు..దానికి రంగయ్య అదేంటి ..? ధనయ్య నీకు ఇక్కడ పూర్తి స్వేచ్ఛ ఉంది. ఏం అవసరమున్న తీసుకోవచ్చు. కావాల్సింది తినచ్చు. చివరికి నా పెట్టి తాళం కూడా ఇక్కడే అందుబాటులోనే ఉంటుంది అన్నాడు .
అక్కడ  ఒకచోట వేలాడుతున్న తాళాల గుత్తి ని చూపించి అన్నాడు రంగయ్య..వెంటనే అతను గబాలునా  ,ఆ తాళాలతో పెట్టె తెరుచుకోవటం లేదే, అంటూ నోరుజారతాడు..అప్పుడు కళ్ళు తెరుచుకున్న రంగయ్య.. ధనయ్య తో ఇలా అన్నాడు..  అడిగినప్పుడల్లా  నేను డబ్బులు ఇస్తుండగా, తాళాలతో నీకు పని ఏమివచ్చింది. ధనయ్య నీ గురించి నా భార్య ఎంత చెబుతున్నా నేనే పట్టించుకోలేదు. ఇక చాలు మీకు రావాల్సిన ,డబ్బులు వెంటనే తీసుకొని వెళ్ళిపో అన్నాడు రంగయ్య కోపంగా.. చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతూ ఇల్లు వదిలాడు ధనయ్య.
నమ్మకం అనేది పోతే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి సర్వశక్తులా  ప్రయత్నిస్తూనే ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: