మంచిమాట : ఈ తప్పులను మీరు కూడా చేస్తున్నారా..?

Divya
ఒక్కోసారి మనకు తెలియకుండానే కొన్ని కొన్ని తప్పులను చేస్తూ ఉంటాము. అయితే ఇది మనకు మనం అయినా నేర్చుకుని ఉండాలి లేదా మన పెద్ద వాళ్ళ నుండి అయినా అలవాటు చేసుకుని ఉండాలి. అయితే ఈ అలవాట్లు వల్ల మనకు అతి పెద్ద ప్రమాదాలు కూడా తలెత్తవచ్చు అని అంటున్నారు నిపుణులు. అయితే ఆ అలవాట్లు ఏమిటి..? వాటి వల్ల జరిగే నష్టం ఏమిటి..? అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

తెల్లని దంతాలు:
మనం ఎవరితోనైనా కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి అంటే ముందుగా చిరునవ్వు కావాలి. అంతేకాదు మన పళ్ళు తెల్లగా ఉంటేనే, మన చిరునవ్వు అంత బాగుంటుంది.. అని చాలామంది పళ్లను గంటల తరబడి తోముతూ తెల్లగా తయారు చేస్తూ ఉంటారు. ఇలా పళ్ళు తెల్లగా చేసుకోవడం కూడా ప్రమాదం అని అంటున్నారు వైద్యులు. ఎందుకంటే మనం ఉపయోగించే పేస్టు లో కెమికల్స్ ఉండడం వల్ల, అవి మన పళ్ళ దృఢత్వాన్ని నాశనం చేస్తాయట. కాబట్టి రెండు లేదా మూడు నిమిషాల కంటే ఎక్కువ సేపు పళ్ళు శుభ్రం చేయకూడదు అని సూచిస్తున్నారు. లైట్ ఎల్లో కలర్ కలిగిన పళ్ళు చాలా దృఢం అని చెబుతున్నారు.
ఎక్కువసేపు స్నానం చేయడం:
ఎక్కువసేపు స్నానం చేయడం వల్ల చర్మ సమస్యలు తలెత్తుతాయి. ఎందుకంటే చర్మం పొడిబారడమే కాకుండా, సబ్బు లో ఉన్న కెమికల్స్ చర్మం లోపలికి వెళ్లి అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. కాబట్టి స్నానం చేసేటప్పుడు పది నిమిషాలకు మించి స్నానం చేయకూడదని సిఫార్సు చేస్తున్నారు వైద్యులు.

గోర్లు కత్తిరించుకోవడం:
ఈ గోర్లు వారానికి లేదా రెండు వారాలకు ఒకసారి కత్తిరించుకోవడం మంచి పద్ధతి. కానీ నెయిల్ కట్టర్ తో ఒకసారి మనం ఉపయోగించిన తర్వాత , దానిని మన కుటుంబ సభ్యులు కూడా ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఇలా గోర్లు కత్తిరించినప్పుడు మన గోర్లలో ఉండే బ్యాక్టీరియా నెయిల్ కట్టర్ లోకి వెళ్లి, ఇతరులు కట్ చేసుకున్నప్పుడు వారి నెయిల్స్ లోకి ప్రవేశించడం జరుగుతుంది . తద్వారా అనేక ఆరోగ్య సమస్యలతో పాటు, ఇన్ఫెక్షన్ లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఒకసారి ఉపయోగించిన తర్వాత దానిని వేడినీళ్లలో శుభ్రం చేయడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: