మంచిమాట : పెద్దలు ఇచ్చే తీర్పు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి..

Divya
ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు , పెద్దల దగ్గరికి వెళ్తే వారు ఇరువురిని దృష్టిలో పెట్టుకొని తీర్పు ఇవ్వాలి కదా..! అందుకు తగ్గట్టుగా ఒక తెలివైన తీర్పు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

భీమునిపట్నంలో సచ్చిదానంద వర్మ అనే ఒక ఊరి పెద్ద ఉండేవాడు. అతను ఊరి ప్రజల వివాదాలకు న్యాయంగా పరిష్కారం చెబుతాడని మంచి గుర్తింపు. ఆయన ఒకరోజు బజారుకు వెళ్తూ ఉండగా, దారిలో ఇద్దరు వ్యక్తులు వాదించుకోవడం గమనించాడు. వారిద్దరిలో ఒకరు జమిందారు, మరొకతను ధాన్యం బస్తాలు మోసే పనివాడు.. వీరిద్దరి మధ్య వివాదాలకు కారణం.. పనివాడు ఒక బరువైన బియ్యం బస్తా మోస్తూ ఉండగా, అది జారీ జమిందారీ కోడి పై పడడంతో అక్కడికక్కడే మరణించింది. దాంతో జమిందారు పనివాడితో ,." అన్యాయంగా నా కోడిని చంపేసావు. ఆ కోడి కనీసం ఇంకో సంవత్సరంలో ఎన్ని గుడ్లు పెట్టేదో ,అంత చెల్లించు" అన్నాడు..
అందుకు పని వాడు అయ్యా..! నేను పేదవాడిని. అంత డబ్బు చెల్లించలేను.  పొరపాటున చేయి జారి కోడి మీద పడింది. క్షమించండి ..కోడికి అయ్యే మొత్తం  మాత్రం కట్టగలను అన్నాడు. చుట్టూ జనం గుమిగూడారు. ఇంతలో అక్కడికి సచ్చిదానంద వర్మ రావడం చూసి, జనం అతను సరైన తీర్పు ఇస్తాడు అని ఆశించారు. జమీందారు, పనివాడు సచ్చిదానంద వర్మతో జరిగిన విషయం వివరించారు. కాసేపు ఆలోచించిన సచ్చిదానంద వర్మ ..సరై పని వాడు అతనికి కోడి వల్ల  సంవత్సరమంతా వచ్చే గుడ్లు అలాగే కోడి మొత్తం వంద రూపాయలు చెల్లించాల్సిందే.. అని చెప్పాడు. అది విని అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఇక పనివాడు నిరాశ పడ్డాడు.
ఇక అంతలోనే సచ్చిదానంద వర్మ ..నా తీర్పు ఇంకా ముగించలేదు. అని కొనసాగించాడు.. జమీందారు తో "కోడిగుడ్లు పెట్టాలి అంటే నువ్వు దానికి  దాణా పెట్టాలి గా మరి. ఒక సంవత్సరం లోనే కోడి ఎంత దాణా తినేది అని అడిగాడు. రెండు బస్తాలు స్వామి అని అన్నాడు జమిందారు. అయితే ఆ రెండు బస్తాల ధాన్యం వెలను నువ్వు.. పని వాడికి ఇవ్వు అన్నాడు సచ్చిదానంద వర్మ. ఆయన తీర్పు అర్థంకాక అది ఎక్కువ అవుతుందని జమీందారు అయోమయంగా చూశాడు..

"ఏమీ లేదు రాబోయే సంవత్సరంలో నీ కోడి ఇవ్వబోయే లాభం ఆశిస్తున్నాము. మరి సంవత్సరాంతం కోడికి పెట్టే ఖర్చు ఎంత అవుతుంది. కోడి లాభం అతను నీకు ఇవ్వాలంటే , ఆ కోడి కి దాణా ఇవ్వాలి కదా..! అని వివరించాడు. రెండు బస్తాల ధాన్యం విలువ  తనకు రాబోయే వంద రూపాయల కంటే ఎక్కువ అని గ్రహించాడు జమిందారు. ఇక దానితో నువ్వు నాకేం ఇవ్వాల్సిన అవసరం లేదులే, అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జమిందారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: