మంచిమాట: అత్యాశ అనర్ధాలకు దారి తీస్తుంది..

Divya
 
ఆశ.. అత్యాశ.. ఈ రెండు పదాల మధ్య తారతమ్యం తెలియకుండా మనిషి అజ్ఞాని అవుతున్నాడు. అంతేకాదు విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ, మనిషి కాస్త మూర్ఖుడు అవుతున్నాడు. ఆశ ఉండాలి కాని అత్యాస ఉండకూడదు అని తెలిసినప్పటికీ, అత్యాశ పైన ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు మానవుడు. అంటే అత్యాశ అనర్థాలకు దారితీస్తుంది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇందుకు సంబంధించిన ఒక చిన్న కథను ఉదాహరణగా తెలుసుకుందాం..
అనగనగా ఒక ఊరిలో ఒక పేద రైతు పొలం దున్నుతూ.. దేవుడా నా కష్టాలు తీర్చే మార్గం చూపవా.. అని ప్రార్థన చేశాడు. నాగలికి అకస్మాత్తుగా ఏదో తగిలినట్లు అనిపించి చూస్తే, ఒక చిన్న పెట్ట దొరికింది. అంతలోనే ఆకాశవాణి.. ఈ పెట్టెలో నీకు ఒక బంగారం నాణెం  దొరుకుతుంది. దాని తీస్తే ఇంకొక నాణెం  దొరుకుతుంది. ఇలా  చెయ్యి పెట్టిన ప్రతిసారీ ఒకటి తప్పకుండా దొరుకుతుంది. నీకు కావాల్సినన్ని తీసుకున్నాక, ఆ పెట్టెను నదిలో పారవేయి. అయితే ఒక విషయం గుర్తు పెట్టుకో.. పెట్టెను నదిలో పడేశాక  మాత్రమే, నువ్వు డబ్బులు ఖర్చు చేయాలి. లేదంటే మధ్యలో ఖర్చు చేస్తే నువ్వు తీసిన డబ్బు మొత్తం మాయమవుతుంది అని చెప్పింది.
పరమానందంతో ఆ పెట్టెను రైతు ఇంటికి తీసుకెళ్ళి, ఆ రాత్రంతా పెట్టెలో నుంచి బంగారు నాణాలు తీసి, ఒక పెద్ద  గోనె సంచి నింపాడు. ఆ మర్నాడు కూడా తిండి, నిద్ర మానేసి మరీ నాణేలు తీసి మరో పెద్ద గోనె సంచి నింపాడు. ఏమైనా తినడానికి కూర్చున్న లేదా నిద్రపోయినా సమయం మొత్తం వృధా అవుతుందని, అలా చాలా రోజుల పాటు ఏమీ తినకుండా, తాగకుండా, నిద్రపోకుండా, దాదాపు 10 గోన సంచుల నాణేలను నింపాడు. ఇక అప్పటికి ఆయన ఆశ తీరలేదు. పని కూడా ఆపలేదు. అత్యాశకు ఫలితంగా ఒక రోజు బాగా నీరసించి పోయి చివరికి మరణించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: