మంచిమాట: ధృడమైన నమ్మకం జీవితంలో ఎన్నో నేర్పిస్తుంది..

Divya
మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే, దాని మీద ముందుగా మనకు నమ్మకం కలగాలి. అప్పుడే ఏదైనా జీవితంలో సాధించగలము అనే ఆలోచనకు మనం వస్తాము. మన మీద మనకు నమ్మకం ఉండటంతో పాటు మనం చేసే పని మీద కూడా మనకు నమ్మకం ఉండాలి. అప్పుడే  అది విజయవంతమవడంతో పాటు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇందుకు ఉదాహరణ ఇప్పుడు ఒక కథను తెలుసుకుందాం..

అనగనగా ఒక ఊరిలో పశువులను మేపుతున్న ఒక బాలునికి, చెట్టుపైనున్న గూటిలో ఒక గ్రద్ద గుడ్డు కనిపించింది. ఇక ఆ గుడ్డును తీసుకుని, తన ఇంట్లో పొదిగే కోడి గుడ్లలో ఉంచాడు. ఇక ఈ గద్ద గుడ్డుని కోడి..తన  గుడ్లతో పాటు పొదిగింది. గద్ద పిల్ల తాను కూడా కోడిపిల్ల అనుకొని , ఇతర కోడి పిల్లలతో పాటు తిరగసాగింది. ఇక ఆ తల్లి కోడి కూడా గద్ద పిల్లను తన కోడిపిల్ల అన్న విశ్వాసంతోనే చూసుకోసాగింది. అంతే కాదు తన బిడ్డ లాగే వ్యవహరిస్తూ ఉండేది. ఆ గద్ద పిల్ల ఎగరడానికి ప్రయత్నించలేక, మిగతా కోడి పిల్లల మధ్య తిరుగుతూ వచ్చింది.

గద్ద పిల్ల దృఢంగా పెరిగి పెద్దయిన తర్వాత, తను కోడి పిల్ల కాదనే భావనతో పైకి ఎగరాలి అన్న కోరిక కలిగింది. తాను ఎగరగలను అనే నమ్మకం కూడా ఈ కోరికకు బలమైన కారణం అయ్యింది. ఒకరోజు గద్ద పిల్ల తన విశాలమైన రెక్కలను విరుచుకుని ఎగిరేందుకు ప్రారంభించింది. అలా ఎగురుతూ పై పైకి పోయింది. పై ఎత్తుకు ఎగిరిన గద్ద ఎత్తయిన చెట్టుపై ఉన్న తన గూటికి చేరింది. తను విధికి అనుగుణంగా కంచె లోపల తిరిగే కోడి పిల్లగా జీవించడం కాదు  అనే నమ్మకం కలిగింది. ఇక ఆ నమ్మకం కారణంగా ఆ గద్ద.. తన నిజమైన గట్టి శక్తి ఏంటో తెలుసుకోగలిగింది.
ఇప్పుడు ఆ గద్ద ఎత్తయిన చెట్టు పైన నివసించే ధైర్యానికి, స్వతంత్రానికి చిహ్నంగా గరుడపక్షి గా విశాలమైన ప్రపంచం లో  వినీల ఆకాశం లో చాలా ఎత్తుకు ఎగరగలిగింది.
కదా ..! ఎవరికైనా జీవితంలో నమ్మకం ఉండాలి. సంకల్పంతో చేసే ఏ పని అయినా సరే భవిష్యత్తులో ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: