మంచిమాట: పుట్టింటి నుండి మెట్టింటికి తీసుకెళ్లని వస్తువులు..

Divya
సాధారణంగా హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మహిళలు పెళ్లి అయిన తర్వాత తమ పుట్టింటి నుండి మెట్టినింటికి కొన్ని వస్తువులను తీసుకు వెళ్ళకూడదని, తీసుకెళ్లిన యెడల పుట్టింటికి నష్టం కలుగుతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఆ వస్తువులు ఏవి.. ఎందుకు తీసుకెళ్లకూడదు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా చెప్పాలంటే , ఆడపిల్లలు పెళ్లయిన తర్వాత పుట్టింటి నుండి మెట్టినింటికి నచ్చిన ఏదో ఒక వస్తువును తీసుకెళ్తుంటారు. అంతే కాదు ఎప్పుడైనా పుట్టింటికి వచ్చినప్పుడు అక్కడ ఏదైనా కొత్త వస్తువు కనిపిస్తేచాలు.. ఇది నా కోసమే తెచ్చారా..?  అంటూ తీసుకెళ్లడం చూస్తూనే ఉంటాం. అయితే అలా తీసుకెళ్లేటప్పుడు పొరపాటున కూడా ఈ వస్తువులను తీసుకెళ్లకూడదు. ముఖ్యంగా అలా తీసుకెళ్లే వాటిలో బంగారం, ఇంటి అలంకరణ వస్తువులు, వెండి సామాన్లు, కిరాణా సరుకులు, చీపుర్లు, అమ్మ చీరలు వంటివి ఎక్కువగా తీసుకెళ్తుంటారు.
ముందుగా కత్తులు, కత్తిపీటలు, కత్తెరలు, సూదులు వంటివి పుట్టింటి నుండి మెట్టినింటికి తీసుకు వెళ్ళ కూడదు. ఇలా చేయడం వల్ల ఇరువురి కుటుంబాల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. అంతే కాదు రెండు కుటుంబాల మధ్య పగలు, ప్రతీకారాలు పెరిగే అవకాశం కూడా ఉందట.
ఇక తరువాత చింతపండు, ఉప్పు. ఇక ఇప్పటికీ చాలామందికి.. పుట్టింటివారు తమ అమ్మాయికి కిరాణా సరుకులు కూడా కొని ఇస్తున్న  సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. అయితే అలాంటి వాటిలో ఉప్పు, చింతపండు ఉండకుండా చూసుకోండి. ఈ రెండూ తీసుకెళ్లడం వల్ల ఇరువురి కుటుంబాల మధ్య బంధాలు తెగిపోతాయి.

ఇక చీపురు.. ఇల్లు ఊడ్చే చీపురు లక్ష్మీదేవితో సమానం కాబట్టి చీపురుని తీసుకెళ్లడం వల్ల పుట్టింటివారు పేదరికంలో పడతారనే విషయాన్ని గమనించాలి. ఇక అమ్మ గారి ఇంట్లో ఉండే లక్ష్మీదేవిని అత్తగారింటికి తీసుకెళ్లినట్లు అవుతుంది. అప్పుడు అమ్మ ఇంటి వారు పేదరికంలో పడతారు.

చూశారు కదా..!  మహిళలు ..పెళ్లయిన తర్వాత ఇలాంటివి కనుక మీరు చేస్తున్నట్లయితే వెంటనే ఆపి వేయండి. పుట్టింటికి - అత్తింటికి మధ్య పరస్పర సంబంధాలను పెంపొందించేలా చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: