మంచిమాట : కరోనా వచ్చిన తర్వాత జరిగిన మంచి పనులు ఏమిటో తెలుసా..

Divya

మనం బ్రతికుండగా ఈ పనులు జరగవు అని ఆలోచిస్తున్న సమయంలో కరోనా వచ్చి,  ఒక అంత మంచే జరిగిందని చెప్పవచ్చు. ఏంటి కరోనా రావడం వల్ల మంచి ఏం జరిగింది అని ఆలోచిస్తున్నారా..? నిజమేనండి.మనం బ్రతికుండగా ఇక జీవితంలో ఈ పనులు జరగవు.. అని ఆలోచించిన వారికందరికీ ఇప్పుడు పులిస్టాప్ చెప్పే సమయం వచ్చింది.. కరోనా వచ్చిన తరువాత సంభవించిన మార్పులు ఏమిటి..వాటి వల్ల మనకు ఎంతవరకు లాభం కలిగింది.. అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

కరోనా వచ్చిన తర్వాత లాక్ డౌన్ పెట్టడంతో బయట ఎవరు కనిపించినా, వారిపై రుసుము విధించడం మొదలయింది. అంటే ఫలితంగా మద్యం దుకాణాలు అన్నీ మూతపడ్డాయి.. పెద్ద పెద్ద నగరాల్లో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో నాలుగు గంటల దాకా, బయట ట్రాఫిక్ లో గడిచిపోయే పరిస్థితి నుంచి బయట పడ్డాము.. ఇక పెద్ద నగరాల నుంచి మండలం వరకు ఎక్కడ చూసినా నిర్మానుష్యమైన రోడ్లు మాత్రమే చూడగలుగుతున్నాం. ట్రాఫిక్ జామ్ లంటూ లేనేలేవు.


ఇక కాలుష్యరహిత పట్టణాలను చూడగలుగుతున్నాము. ఇంట్లో ఉండే పెద్దలు పిల్లల చదువుల పై శ్రద్ధ చూపే రోజులు కూడా వచ్చేశాయి. ఇక మగవారు కూడా ఇంటిపనిలో, వంట పని లో మహిళలకు సహాయం చేయడం మొదలుపెట్టారు. ఇక డబ్బులు,నగలు, షాపింగ్ లంటూ అనవసరంగా డబ్బులు వృధా చేయకుండా, అవసరమైన వస్తువులను మాత్రమే కొనుక్కుంటూ డబ్బులు ఆదా చేయడం నేర్చుకున్నారు..

ఇక బయట అడ్డమైన గడ్డి తినడం మానేశారు. సామాజిక బాధ్యత గురించి ఆలోచించడం, పక్క వారికి రోగాలు రాకూడదని భగవంతుడిని కోరుకోవడం వంటి అలవాట్లను నేర్చుకున్నారు. భారతీయ సాంప్రదాయ పద్ధతులను గుర్తుతెచ్చుకొని  మరీ పాటించడం మొదలు పెట్టారు. ఇక వ్యక్తిగత శుభ్రత మీద పరిసరాల పరిశుభ్రత మీద అత్యంత జాగ్రత్త వహిస్తున్నారు. ఇక డబ్బు ఎంత ఉన్నా అవసరమైనప్పుడు మన పని మనం చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని, పనిమనిషి కూడా అవసరం లేదు అన్నట్టుగా మారిపోయారు.. చూశారు కదా కరోనా వచ్చిన తర్వాత ఇన్ని మంచి పనులు జరిగాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: