మంచిమాట : ఏ మనిషిని అతిగా నమ్మకు.. నమ్మావో ఇక అంతే..

Divya

మనం నివసిస్తున్న ఆధునిక ప్రపంచంలో, ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీని మనం చూస్తూనే ఉన్నాము.. అయితే ఇవన్నీ మనకు తెలియాలి అంటే అన్ని రంగాలపైనా మనకు అవగాహన ఉండాలి. అప్పుడే ప్రపంచం నలుమూలల ఏం జరుగుతుందో అనే విషయం కూడా మనము తెలుసుకోగలుగుతాం. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీకు ఒకే వేదిక తారసపడుతుంది. ఆ వేదిక ఏమిటంటే "ఇండియా హెరాల్డ్" . ఇండియా హెరాల్డ్ ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను మీకు చూపిస్తూ మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలనే నెపంతో ఎప్పటికప్పుడు మంచి మాటలను మీ ముందుకు తీసుకొస్తుంది.. అందులో భాగంగానే ఈరోజు మంచి మాట ఏమిటంటే..ఏ మనిషిని అతిగా నమ్మకు.. నమ్మావో ఇక అంతే..

 దీని వివరణ ఏమిటంటే.. కాలం కన్నా వేగంగా మారే మనుషుల వద్ద జీవిస్తున్నాము. కాబట్టి ఏ మనిషిని అతిగా నమ్మకూడదు. కాదని నమ్మావో ఇక అంతే.. జీవితంలో సర్వం కోల్పోవలసి వస్తుంది. కాబట్టి ఏ మనిషి నైన నమ్మేటప్పుడు ఆచితూచి ముందడుగు వేయడం మంచిది . అలా కాదు అని ఎవరిని పడితే వారిని నమ్మి, నీకున్న సర్వస్వాన్ని అప్పజెప్పావు అంటే ఇక నిలువునా మోసపోవాల్సిందే. ఎవరు మన వాళ్లు కాదు అలాగని ఎవరు పరాయి వాళ్ళు కూడా కాదు.. ఎంతవరకు నమ్మాలో.. అంతవరకే నమ్మాలి.. అని దీని అర్థం...

ఉదాహరణకు మీరు ఎవరినైనా బాగానే నమ్మారనే అనుకోండి. మీకున్న ఆస్తులు, అంతస్తులు వారిని చూసుకోమని, అప్పగించారు అనుకోండి. మొదట్లో నమ్మేలా కొద్దిరోజులు మీ ఆస్తులకు,అంతస్తులకు ఎలాంటి డోకా ఉండదు. ఇక ఎప్పుడైతే కొంచెం చిన్న పొరపాటు జరిగిందో ఇక నమ్మిస్తూనే మోసం చేయడం ప్రారంభిస్తారు. కాలం కన్నా వేగంగా మారే మనుషుల మధ్య బ్రతుకుతున్నాము. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎవరిని అతిగా నమ్మకూడదు. ఒకవేళ నమ్మిన మీకున్న రహస్యాలను ఏవి పంచుకోవద్దు. అప్పుడే జీవితాంతం సుఖంగా జీవిస్తారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: