మంచి మాట : మోసానికి.. నమ్మకద్రోహానికి మధ్య తేడా ఏంటో తెలిస్తే, ఎప్పటికీ ఆనందంగా ఉండవచ్చు..!

Divya

ప్రతి సారి ప్రతి క్షణం సరికొత్తగా వినూత్నమైన ఆలోచన తో ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తూ, మీలో మార్పులు తీసుకురావాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది ఇండియా హెరాల్డ్.. ప్రస్తుతం అందులో భాగంగానే మీ కోసం ఒక మంచి మాటను మీ ముందుకు తీసుకు వచ్చింది. అదేమిటంటే..మోసానికి.. నమ్మకద్రోహానికి మధ్య తేడా ఏంటో తెలిస్తే, ఎప్పటికీ ఆనందంగా ఉండవచ్చు..!

దీని అర్థం ఏమిటంటే..,మోసం అనేది అందరూ చేస్తారు.. కానీ నమ్మకద్రోహం అనేది కేవలం నువ్వు నమ్మిన వాళ్లు మాత్రమే చేస్తారు.. అయితే ఈ రెండింటికీ మధ్య ఉన్న తేడాను గమనించినట్లయితే, ఇక ఎప్పటికీ వీటికి దూరంగా నువ్వు ఉండగలుగుతావు. అప్పుడే నీ జీవితంలో సుఖసంతోషాలకు కొలువు  ఏర్పడుతుంది. అని దీని వివరణ..

మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో, వారే మనల్ని మోసం చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ప్రతి ఒక్కరు కూడా మోసం చేసే అవకాశం కూడా ఉండకపోలేదు. అలాగని అందరూ మోసం చేస్తారు అని మాత్రం అనుకోకూడదు . ఎదుటివారితో జాగ్రత్తగా ఉండాలి అనేది దీని అర్థం . కాబట్టి ఏ విషయంలోనైనా ముందుగా మనం ఆలోచించి, ఆ తర్వాత ఇతరుల సలహా తీసుకోవడం మంచిది. ప్రతి ఒక్కటీ నీవే క్షుణ్ణంగా తెలుసుకోవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు, వాటికి అనుగుణంగా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి, మనం చేసే ఏ పని అయినా సరే మంచిదా.. చెడ్డదా..  ఇతరులకు ఎలాంటి నష్టాన్ని కలిగించకుండా ఉండగలిగితేనే ముందడుగు వేయాలి..

కానీ మనం సమయం కంటే వేగంగా మారే మనుషుల మధ్య బ్రతుకుతున్నాము. కాబట్టి జాగ్రత్తగా బ్రతకడాన్ని నేర్చుకోవాలి. ప్రతి ప్రశ్నకు సమాధానం నీవే వెతుక్కోవాలి.. అప్పుడే సమాజంలో ఒక గౌరవం అంటూ ఉంటుంది. మోసగాళ్లు మోసం చేసినా , నమ్మిన వాళ్లు ద్రోహం చేసినా ఈ రెండింటికీ మధ్య తేడా తెలిసిన వాడివి అవుతావు కాబట్టి చీకూచింతా లేకుండా హాయిగా ఉండవచ్చు. కాబట్టి ఎవరినైనా నమ్మేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నమ్మినా కూడా ప్రతి ఒక్క విషయాన్ని వారితో పంచుకోవాల్సిన అవసరం లేదు. నీ మనసుకు మించిన మంచి మిత్రుడు ఇంకెక్కడా లేడు అని గుర్తుపెట్టుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: