మంచి మాట : విజ్ఞతను మించిన మిత్రుడు, అజ్ఞానాన్ని మించిన శత్రువు లేడు
పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా అని వేమన మహాకవి చెప్పిన మాటకు అర్ధం తెలియక పోయినా, కనీసం తెలుసుకోవాలని ప్రయత్నించం ఎందుకంటే మన చదువులంత ఇంగ్లిష్మయంకధ " తన కోసం బ్రతికేవాడు మాములు మనిషి ఇతరులకోసం బ్రతికేవాడు మహానుబావుడు" అన్నాడో మహానుబావుడు. ఈ బిజీ లైఫ్ లో డబ్బు ఫై వున్న శ్రద్ద మరొక దాని ఫై లేదు, కాదంటారా? చివరికి తన గురించి తాను ఆలోచించడానికే టైం మిగల్చడంలేదు. దీనికికారణం అవసరానికి మించి డబ్బు సంపాదించాలనే ఆలోచన .
ఒక్కసారి కుడా అవసరానికి మించిన డబ్బెందుకని, ఎవరు ఆలోచించడం లేదు ఒకవేళ అలాంటి ఆలోచన మనసులో కదలినపుడు స్వార్ధమనే ముసుగుతో దాచి పెడుతున్నాము. ఎంతసేపు నేనుకాకుంటే నా కొడుకులు అనుబవిస్తారనే ఆలోచనే తప్ప, అసలా కొడుకులు సోమరిపోతులు కావడానికి వారు సంపాదించే మితిమీరిన డబ్బే అని ఎవరాలోచించడం లేదు.
ఒక్కసారి మీ మంచి మనసుతో ఆలోచించండి ఎందుకీ అసమానతలు, అందరం పుట్టింది అమ్మకడుపునుంచేగా కాని, కొందరికి తినడానికి తిండి దొరకడం లేదు మరికొందరికి తికడుపు నింపుకొవడం కొసమె తింటే పది రొట్టెలైనా చాలవు. పంచుకుని తింటే ఒక్క రొట్టె ముక్కైనా కడుపు నిండుతుంది. పంచుకొవడం లో ఉన్న ఆనందం అది. ఈ మానవ సూత్రాన్ని ప్రచారం చెయ్యండి న్న తిండి అరగాడంలేదు. మనిషిలో మానవత్వం కరువౌతుంది మనిషికి మృగానికి తేడా లేకుండా పోతుంది.
ఒక చెట్టు నుంచి లక్ష అగ్గిపుల్లలు తయారు చేయవచ్చు .ఒక్క అగ్గిపుల్లతో లక్ష చెట్లను కాల్చి వేయను వచ్చు .అలాగే మనిషికి లక్ష మంచి ఆలోచనలు ఉండవచ్చు కానీ ఒక్క చెడ్డ ఆలోచన లక్ష మంచి ఆలోచనలను కట్టడి చేయవచ్చు .అందుకే అందరం మంచిని పెంచే మంచి ఆలోచనలు చేయాలి.