మంచిమాట: డబ్బుంటే సరిపోదు.. మంచి వ్యక్తిత్వం ఉంటేనే సమాజం గౌరవిస్తుంది!

Durga Writes

నేటి మంచిమాట.. డబ్బుంటే సరిపోదు.. మంచి వ్యక్తిత్వం ఉంటేనే సమాజం గౌరవిస్తుంది! అవును.. ఎంత డబ్బుంటే ఏం లాభం? కనీసం పట్టెడన్నం పెట్టలేని నీకు ఏం ఉపయోగం? ఆకలితో ఉన్నవాడికి నీ చేత్తో అన్నం పెడితేనే కదా! నీ జీవితం బాగుండేది.. లేకపోతే మనిషి జీవితం ఎంత దారుణంగా ఉంటుంది? 

 

 

అయినా మంచి వ్యక్తిత్వం ముందు ఎంత డబ్బు ఉన్న సమానం కాదు.. సమాజం మనల్ని గౌరవించాలి అంటే మంచి వ్యక్తిత్వం ఉండాలి.. మంచి మనసు ఉండాలి.. నీ దగ్గర రూపాయి ఉందనిలే.. నీకు సహాయం చెయ్యాలి అని అనిపించాలి.. అప్పుడే నీ జీవితం అందంగా ఉంటుంది.. నిన్ను సమాజం గౌరవిస్తుంది.. 

 

 

అలా కాదు అని.. నాతో డబ్బు ఉంది.. నేను ఇలాగే ఉంటా అంటే నిన్ను సమాజం కాదు కదా.. కనీసం జంతువులు కూడా చూడవు.. అందుకే మనిషి విలువ తెలుసుకో.. మనిషి గౌరవించడం తెలుసుకో.. అప్పుడే జీవితం అందంగా ఉంటుంది.. లేకుంటే నిన్ను ఎవరు గౌరవించారు.. నువ్వు ఉన్న లేకున్నట్టే వ్యవహరిస్తారు.. అతను ఉంటే ఎంత లేకుంటే ఎంత? ఎవరికి ఉపయోగం ? అని అనుకుంటారు. 

 

 

అదే నువ్వు అందరితో మంచిగా ఉండి.. ఎవరికైన కష్టం అని అనగానే నేను ఉన్న అని వెళ్ళీ సాయం చేస్తే నిన్ను అందరూ గుర్తుపెట్టుకుంటారు.. అందరూ గౌరవిస్తారు.. ఏ కార్యక్రమం అయినా.. అన్న వస్తాడు.. చేద్దాం అని అంటారు.. లేదు అంటే చెప్పను కదా! ఎవరు పట్టించుకోరు.. డబ్బు ఉంది అనే అహంకారాన్ని వదిలెయ్యి జీవితం గొప్పగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: