మంచిమాట: వెన్నెల ఒకటే.. చూసే కన్నులు వేరు! జీవితం ఒకటే.. నడిచే దారులు వేరు!
నేటి మంచిమాట.. వెన్నెల ఒకటే చూసే కన్నులు వేరు.. జీవితం ఒకటే నడిచే దారులు వేరు! అంతేకదా అండి.. వెన్నెల అందరికి ఒకటే కదా! కాదు అంటే మీరు ఇది చదవకుండానే వెళ్లిపోవచ్చు.. ఎందుకంటే మీరు వెరైటీ కదా! సరే అది పక్కన పెడితే.. అందరికి వెన్నెల ఒకటే.. పేద వాడికి అయినా.. సంపన్నుడుకైన.. ఆకలితో అలమటిస్తున్న వారికైనా .. కానీ చూసే కళ్ళే వేరు..
నువ్వు ఆనందంగా చూస్తే దాన్ని ఆస్వాదిస్తావు.. బాధతో చూస్తే వెన్నెల కూడా బరువే అవుతుంది.. అలానే జీవితం కూడా అంతే.. ఎవరి దారులు వాళ్ళవి.. జీవితం లో అందరూ ఒకటే దారిలో నడవారు కదా! ఎవరి దారిలో వారు నడుస్తారు.. పదవ తరగతి వరుకు అందరూ కూడా ఒకేలా చదువుతారు.. కానీ ఆ తర్వాత ఎంచుకునే కోర్సుల బట్టే జీవితాలు నిర్ణయించబడతాయి.
ఇంటర్ లో బైపీసీ తీసుకున్నా వాడు .. డాక్టర్ కాలేకపోయినా బి పార్మసీ చేసి కనీసం మెడికల్ షాప్ అయినా పెట్టుకుంటాడు.. అదే ఎంపీసీ తీసుకున్నోడు సాఫ్ట్ వెర్ ఇంజినీర్ కాలేకపోయినా కనీసం ఏదో ఒకదానిలో కుటుంబానికి సరిపోయేంత జీతాన్ని సంపాదించి జీవితాన్ని ఆనందిస్తాడు.. అంతే.. మెడికల్ షాప్ అయినా ఉద్యోగం అయినా మొదట ఎంచుకున్న దారి బట్టి ఉంటుంది.
అందరికి తెలిసిన ఉదాహరణ అయినా మళ్లీ చెప్తున్నా.. ఇద్దరు అన్నదమ్ములు.. ఒకడు తాగుబోతు,, ఒకడు ప్రయోజకుడు, తాగుబోతును నువ్వెందుకిలా అయ్యావు అని అడిగితే.. అంత మా నాన్న వల్లే.. ఆయన తాగుబోతు, మమల్ని పట్టించుకోలేదు. ఎప్పుడు కొట్టేవాడు, ఏదో నేరం చేసి జైలుకి వెళ్ళేవాడు, అందుకే నేను ఇలా తయారయ్యాను అన్నాడు.
అదే ప్రయాజకుడిని నువ్వెందుకిలా అయ్యావు అని అడిగితే.. '' అంతా మా నాన్న వల్లే. అయన తాగుబోతు, మమ్మల్ని పట్టించుకోలేదు. ఎప్పుడు కొట్టేవాడు, ఏదో నేరం చేసి జైలుకి వెళ్ళేవాడు.. ఆయనని చూసి నేను ఎలా బతకకూడదో నేర్చుకున్నాను.. అందుకే నేను ఇలా తయారయ్యాను అని అంటారు.. అంటే మీరే చుడండి.. ఇద్దరి పరిస్ధితి, జీవితం ఒక్కటే.. కానీ వారు ఎంచుకున్న మార్గాలే వేరు..