మంచిమాట: అవసరాన్ని బట్టి అనుబంధాలు ఏర్పడకూడదు.. అనుబంధాలే అవసరం తీర్చేవై ఉండాలి!

Durga Writes

నేటి మంచిమాట.. అవసరాన్ని బట్టి అనుబంధాలు ఏర్పడకూడదు.. అనుబంధాలే అవసరం తీర్చేవై ఉండాలి. అవును.. అంతేకదా! కొందరు ఉంటారు.. అవసరం వస్తే తప్ప వాళ్ళకు అనుబంధాలు గుర్తుకు రావు. అవసరం ఉంటే తప్ప మనం వారికీ ఆత్మీయులం అవుతాం అనేది గుర్తుకు ఉండదు.. అలాంటి బంధాలు ఉంటే ఎంత? పోతే ఎంత?

 

ఒకవేళ ఒక బంధాన్ని ఒదులు కున్నాము అంటే.. ఆత్మవిశ్వాసం, పరువు ఉన్న వారు ఎవరు కూడా కష్టం వచ్చిన సరే ఆత్మవిశ్వాసంతో అది ఎదురుకోవాలి కానీ.. ఒదులు కున్న బంధాలను పోయి అతికించుకోకూడదు. అలా అతికించుకుంటే సిగ్గు లేనట్టే. అవసరాన్ని బట్టి అనుబంధాలు గుర్తుకు వస్తే అది స్వార్ధ బంధాలు అనే చెప్పాలి. 

 

ఇంకా అలాంటి బంధాలు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే.. మనం ఎప్పుడు ఒకేలా బంధాన్ని భద్రంగా పెట్టుకుంటే.. మనకు కష్టం వచ్చిన.. వారికీ కష్టం వచ్చిన తీర్చుకునేలా ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. అందుకే ఎప్పుడు బంధాలను పోగొట్టుకొకూడదు.. ఒకవేళ పోగొట్టుకుంటే కష్టం వచ్చిన.. నష్టం వచ్చిన ఆ బంధాల వైపు తిరిగి చూడకుండా ఆత్మవిశ్వాసంతో బ్రతకాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: