మంచిమాట: ఎదిరించే వాడు లేకపోతే.. బెదిరించే వాడిదే రాజ్యం అవుతుంది!

Durga Writes

నేటి మంచి మాట.. ఎదిరించే వాడు లేకపోతే.. బెదిరించే వాడిదే రాజ్యం అవుతుంది.. అవును.. నిజంగానే వాళ్లదే రాజ్యం. రాజ్యం నీది అయిన ఆదేశాలు జారీ చేసే హక్కు నీకు లేకపోతే ఉపయోగం ఏంటి?  నిన్ను బెదిరించే వాడు ఒకడు ఉంటె... వాడు చెప్పినట్టు నువ్వు వింటావ్.. నువ్వు రాజు అయినా నీ రాజ్యాన్ని పరోక్షంగా ఆ వ్యక్తి రాజు అవుతాడు. 

 

అదే నువ్వు ఒక్కసారి ఎదిరిస్తే నీ రాజ్యం నీదే అవుతుంది. కాని నీకు ఎదురించే శక్తి లేకపోతే నువ్వు కూడా ఒక బానిస ఏ కదా? ఒక్క రాజ్యాధికారమే కాదు.. నీ మనస్తత్వం కూడా.. నిన్ను నిన్నుగా బతకనివ్వని తల్లితండ్రులు అయినా.. భర్త అయినా.. స్నేహితులు అయినా నువ్వు ఎదురించకపోతే.. ఆలా ఉండు.. ఇలా ఉండు అని గీతోపదేశాలు చేస్తారు.. అలాంటి వారికీ దూరంగా నీకు దగ్గరగా ఉండు. 

 

ఇలా.. మనం ఎదురు తిరగనంత వరుకు మన రాజ్యాన్ని వారికీ ఇచ్చినట్టే అవుతుంది.. అంతేకాదు మనం దైర్యంగా.. ఎవరికి భయపడకుండా ఉంటేనే మన రాజ్యం మనది అవుతుంది. లేదు అంటే మన రాజ్యం మన సొంతం ఎన్నడూ అవ్వదు.. మనం భయపడుతూ పక్కన బతకాల్సి వస్తుంది. అందుకే ఎదురించాలి.. మన జీవితాన్ని మనం బతకాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: