హైదరాబాద్, జూన్1... నాలుగు వందల ఏళ్ళ చరిత్ర గల హైదరాబాద్ కు దేశవిదేశాల్లో ఎంతో పేరుప్రతిష్టలు ఉన్నాయి. నగరాన్ని హైదరబాద్ కన్నాముందు భాగ్యనగరంగా పిలిచేవారు. ఒక అపురూప ప్రేమకు చిహ్నంగా ఈ నగరాన్ని నిర్మంచారు. కులీకుతుబ్షా తన రాణి భాగమతి పేరున ఈ నగరాన్ని నిర్మించారని కొంతమంది చరిత్రకారులు వర్ణిస్తుంటారు. అయితే దీనిపై స్పష్టత లేదని మరి కొందరి వాదన. ఆ రోజుల్లో భాగమతి, కులీకుతుబ్షాల ప్రేమను వర్ణించడం మాత్రం చాలాకష్టమే. రాణి ప్రేమకు గుర్తుగా ఈ నగరాన్ని నిర్మించారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన భాగమతిని యువరాజు ప్రేమించడం జరగని పని. అయితే అలాంటి నమ్మలేని సంఘటననే ఇక్కడ జరిగింది. ఈ నిజమైన ప్రేమకథకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తొలి చూపుల్లోనే యువరాజు భాగమతిపై మనస్సుపారేసుకున్నాడు. గోల్కొండ కోటకు ఎక్కడో దూరంగా మారుమూల గ్రమంలో ఉండే భాగమతికి అప్పుడు 14 ఏళ్ళ ఉన్నాయి. ఆమె ప్రతిరోజు దగ్గర్లోని గుడికి వెళ్తుండేది. ఒక సారి యువరాజు కులీకుతుబ్షా ఆ దారిలోనే వెళ్తూ ఆ యువతిని చూడడంతో ఆయన ఆమైపై మనస్సుపారేసుకున్నాడు. భాగమతితో పరిచయం పెంచుకొని తన కోటకు రమ్మని ఎన్నోసార్లు ఆహ్వనించినా ఆమె తిరస్కరించింది. అప్పటి నుంచి యవరాజుకు మరింత ప్రేమ పెరిగింది. ఆమె అందాలకు ఆయన మంత్రముగ్ధుడై ఆమెపై కవితలు సైతం రచించేవాడు. చాలారోజుల తర్వతా కులీకుతుబ్షా రాజు అయ్యారు. అప్పుడు వారిద్దరి వయస్సు దాదాపు 16 సంవత్సరాలు, వీరిద్దరి వివాహం చాలా ఘనంగా జరిగిందని చరిత్రసూచిస్తోంది. గోల్కాండ కోటకు తూర్పున భాగ్య నగరాన్ని నిర్మించాలన్న రాజు నిర్ణయానికి అప్పట్లో మతపెద్దలు వ్యతిరేకించినా 1592 నాటికి నగర ముఖ్యభాగం పూర్తయింది. ఇదిలావుంటే రాజుకు వివాహమైన 12 ఏళ్లకు భాగమతి ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. బిడ్డకు హయ్యత్బక్షీ అని నామక రణం చేశారు. అయితే కొంత కాలానికి భాగమతి అనారోగ్యంతో చనిపోయింది. అప్పుడు ఆమె వయసు 40 ఏళ్ళు. అప్పటీకే కొంత నగరాన్ని నిర్మించిన రాజు భాగ్యనగర్ అని పేరు పెట్టారు. భాగ్యనగర్ అన్న పేరు ఇస్లామిక్ సూత్రలకు విరుద్దంగా ఉందని మతపెద్దలు వ్యతిరేకించారు. అయితే భాగమతి ఉన్నంతకాలం ఆ పేరును మార్చటానికి రాజు ఒప్పకోలేదు. మత పెద్దలు, ప్రముఖుల సలహాతో భాగమతి మరణించిన అనంతరం ఎన్నో ఒత్తిడిలమధ్య చివరికి హైదరాబాద్ అని పేరును కులీకుతుబ్షా ప్రతిపాదించాడు. అప్పటి నుంచి ఈ మహా నగరాన్ని హైదరాబాద్ గా పిలుస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఇలాంటి వాదనలను కొట్టిపారేస్తున్నారు. ఏదిఏమైనా ఈ నగరం ప్రేమకు గుర్తుగా నిలుస్తోంది.
మరింత సమాచారం తెలుసుకోండి: