పక్కా వ్యూహం...ప్రణాలిక సిద్దం...నెక్ట్స్ రాష్ట్రం

శతాబ్దకాలపు రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదొడుకులను అధిగమించిన ఘనత కాంగ్రేస్ పార్టీది. అలాంటిది కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కళ్లెదుటే పతనానికి చేరుకుంటుంటే చేతులు ముడుచుకుని కూర్చుంటుందా. అంటే ఎవరు అంగీకరించనిది, అందుకు అనుకున్నట్టుగా కాంగ్రేస్ కీలక సమయంలో పక్కావ్యూహరచన చేసినట్లు కేంద్రమంత్రివర్గ విస్థరణతో రూఢి అయింది. 2014 సాధారణ ఎన్నికలు వచ్చేవరకు పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రణాలిక సిద్దం చేసుకుందన్న విషయం ఇప్పుడు అందరికి తెలిసిపోయింది. ఇక మనరాష్టంలోను అదే పని చేయనున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ అంశం బయటకు పొక్కకముందే అందుకు సంకేతంగా సోనియా ప్రధాని మన్మోహన్ తో సుధీర్ఘమంతనాలు జరిపిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి వర్గంలో విప్లవాత్మక మార్పులగూర్చే కాకుండా ఆంధ్రప్రదేశ్ పై ఇక దృష్టి పెట్టాలని, తెలంగాణ విషయంలో తేల్చేందుకు పార్టి అంతర్గత ఆజాద్ కమిటి వేయాలని నిర్ణయించినట్లు వార్తలు వినిపించాయి. అంతేకాదు తెలంగాణ విషయంలో సోనియా, ప్రధానమంత్రిలు ప్రణభ్ ముఖర్జి కమిటి, ఆజాద్, రవి, షిండే లు ఇచ్చిన నివేదికలను చర్చించినట్లు కూడా తెలిసింది. అందులో భాగంగానే కేంద్రమంత్రి వర్గంలో అనూహ్యమార్పులు చేపట్టి వ్యూహరచన అమలు ప్రారంభించినట్లు ఇప్పుడు అందరికి రుజువైంది. ఇక తదుపరి దృష్టి ఆంధ్రప్రదేశ్ పైనే పెడతారన్న సంకేతాలను కేంద్రమంత్రివర్గవిస్తరణలో మనకు ఊహించని ప్రాధాన్యతను ఇచ్చి స్పష్టంచేసింది కాంగ్రేస్ అధిష్టానం. రాష్ట్రంలోని ఏఒక్క సమీకరణను, ప్రాంతాలను వదలకుండా తగు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా తమ ప్రత్యేక దృష్టి ఇక తెలంగాణాయే అన్న సంకేతాలను ఊహించని రీతిలో ఓమంత్రిపదవి అదనంగా ఇచ్చి జారిచేసింది. సిఎం, పిసిసి, ఉపముఖ్యమంత్రి, మంత్రుల మద్యనే పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఇవి పార్టీని రాష్ట్రంలో పూర్తిస్థాయిలో దిగజార్చాయి. మరోవైపు ప్రధానప్రతిపక్షం తెలుగుదేశం లేఖ నివ్వడమే కాకుండా, పాదయాత్రలో తెలంగాణ కు అనుకూలంగా ప్రకటన జారిచేసి తెలంగాణ రాకపోవడానికి కారణాన్నంత కాంగ్రేస్ పై తోసేసి అందులో సఫలం అయినట్టుగా కూడా కాంగ్రేస్ అధిష్టానం భావించినట్లు సమాచారం. ఇప్పటికైనా తేరుకుని అనూహ్యచర్యలకు దిగితే తప్ప కోలుకోమని, కేంధ్రంలో అధికారంలోకి రావాలన్నా ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవడం తప్పనిసరన్న భావనకు వచ్చినట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే కసరత్తులు పూర్తిచేసి దానిని అమలుచేయడానికి సిద్దమైందట. కేంద్రంలో ఇప్పుడు జరిగిన అనూహ్యమార్పులు ఇక్కడ కూడా చేస్తారట. అంతే కాదు తెలంగాణపై ఖచ్చితమైన అభిప్రాయాన్ని చెప్పే సూచనలు ఉన్నాయట. అందుకే సీమాంధ్ర, తెలంగాణ అంశాలతో పార్టీని బజారుకీడ్చడమే కాకుండా ప్రతిపక్షాలకంటే ఎక్కువ విమర్శించిన వారిపై దృష్టిపెట్టినట్లు సమాచారం. ఇందులో భాగంగానే కావూరి, రాయపాటి, లగడపాటి, ఇటు ఎనిమిది మంది టిఎంపీలను మంత్రివర్గవిస్తరణలో అసలు పరిగణలోకే తీసుకోలేదని తెలిసింది. మొత్తం మీద త్వరలో రాష్ట్ర కాంగ్రేస్ లో భారీమార్పులు ఉంటాయన్నది మాత్రం నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: