యూపీఏ నే‘తలల్లొ’గు‘లాబీ’ గుభాళించలేకపోయింది. తెలంగాణ ఉద్యమంలో అంతా తానే అనుకుంటున్న కేసీఆర్ పాచికలు ఢిల్లీ నాయకులు ముందు పారలేదు. తరచూ యూపీఏ నేతలను కలవడం ఆపై భంగపడటం గులాబీ దండుకు అలవాటుగా మారింది. తిరిగి ఉనికిచాటుకునేందుకు కొన్ని ఉద్యమాలను ఎంచుకోవడం ఆపై ఢిల్లీ చేరుకోవడం యధాప్రకారం వాయిదా వరమందుకుని ఇంటిదారి పడుతుండటం సైతం పరిపాటిగా మారింది.
ఇదిలావుండగా తెలంగాణ సాధన కోసం గులాబీ దండు తెరాస స్థాపించి దశాబ్దం గడచింది. ఇదిగో తెలంగాణ..అదిగో తెలంగాణ అంటూ కాలయాపన తప్ప వేరొకటి జరుగలేదు. తెలంగాణ జిల్లాల్లో బలోపేతంగా ఉన్న తెరసను కాంగ్రెస్ లో విలీనం చేస్తామన్న వారి మాటలను యూపీఏ వర్గాలు విశ్వసించడం లేదు. కారణం సైతం తెలియరావడం లేదు. కాగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉవెత్తున ఉద్యమాలు ఎగిసిపడటం అంతేస్థాయిలో తిరిగి విరామం తీసుకోవడం పరిపాటిగా మారుతోంది.
తెలంగాణ సాధనలో తమ పాత్ర తప్పనిసరిగా ఉండాలన్న తెరాస ఇతరుల ఉద్యమాలపై దుమ్మెత్తిపోయడంలో ముందువరుసలో ఉంటోంది. ముఖ్యంగా తెలంగాణ సాధన కోసం పాటుపడుతున్న కమలంతో జట్టుకట్టకుండా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో ఒంటెత్తు పోకడలకు పోతోంది. అంతేకాకుండా తెలంగాణ సాధన కంటే తెలంగాణ ప్రాంత ఓటర్లు ఆకట్టుకునే యత్నాలకు సానపడుతోంది. అలాగే తెలంగాణ ప్రాంతాల్లో మరే ఇతర పార్టీలు బలపడకుండా పావులు కదుపుతోంది.
ఈనేపథ్యంలో ఇటీవల జరిగిన పరకాల ఉప ఎన్నికల నుంచి తెరాసను తెలియని భయం వెంటాడుతోంది. రాబోవు ఎన్నికలలోపు తెలంగాణ రాష్ట్రానికి సానుకూలంగా ఓ ప్రకటన చేయించి కాంగ్రెస్ విలీనం కావాలన్నదే తెరస లక్ష్యంగా కనిపిస్తోంది. తెలంగాణ సాధించాలంటే ఏ తరహా ఉద్యమాలు చేపట్టాలి. ఏ విధమైన చర్యలు చేపడితే తెలంగాణ సాధ్యమవుతుంది. రాజకీయ పార్టీ పేరుతో ఉద్యమాలు సాగించి ఎవరైనా రాష్ట్ర విభజన సాధించారా? అన్న కోణంలో తెలంగాణ వాదులు ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
ఉద్యమానికి రాజకీయ పార్టీలు వెన్నుదన్నుగా నిలవాలే కానీ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి ఉద్యమాలతో ఫలితాలు సాధించిన దాఖలాలు లేవని తెరాస శ్రేణులు ఇప్పటికైనా గుర్తించాలి. ఇదే విషయాన్ని ముందుగా పసిగట్టిన తెలంగాణ పొలిటికల్ జేఏసీ నేతలు ఇటీవలకాలంలో తెరాస శ్రేణులతో
అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారన్నది సమాచారం.
యూపీఏను యాచించడం కన్నా ఉద్యమాలతో శాసించడమే ముఖ్యమని తెలంగాణ జేఏసీ నిర్ణయాలు తీసుకుంది. ఈక్రమంలో తెలంగాణ మార్చ్ కు తెరాస వర్గాల వారికి ప్రత్యేక ఆహ్వానం అందలేదు. అయినప్పటికీ ఉద్యమం చేజారిపోతే తెలంగాణ ప్రాంతాల్లో తమ ఓటుబ్యాంకు పోయినట్టేనని భావించిన తెరాస నేతలు మార్చ్ ఉద్యమానికి తగుదునమ్మా అంటూ హాజరువుతున్నారు.
నిన్నటి వరకు తెలంగాణ మార్చ్ పై పెదవి విప్పని తెరాస నేతల కేసీఆర్ ఢిల్లీలో తెలంగాణకు వ్యతిరేక పవనాలు వీచడంతో మార్చ్ పై మాట్లడారు. తెలంగాణ వాదులు తలపెట్టిన మార్చ్ ను అడ్డుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వాఖ్యలు చేశారు. ఇకపై తెలంగాణలో గులాబీ దండును దూరంగా ఉంచి తెలంగాణ సాధన కోసం ఉద్యమాలు సాగితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయా? వేచిచూడాలి మరి..?
మరింత సమాచారం తెలుసుకోండి: