మైనార్టీలో మన్మోహన్?

 హైదరాబాద్: మమత బెనర్జీ చెప్పినట్లుగానే కేంద్రంలోని యూపీఏ సర్కార్కు తన మద్దతును ఉపసంహరించుకున్నారు. మమత బెనర్జీ తన మద్దతునను ఉపసంహరించుకోవడంతో కేంద్రంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఇప్పటికయితే మైనార్టీలో పడ్డట్లే. డీజీల్ ధరలు పెంచడం, దేశంలోకి ఎఫ్ డీఐ అనుమతులను నిరసిస్తూ మమత గత శుక్రవారం కేంద్రంలోని యూపీఏ సర్కార్కు డెడ్ లైన్ విధించింది. పేద ప్రజలు మోయలేని భారం వేస్తున్న యూపీఏ సర్కార్ తన పద్దతిని మార్చుకోకుంటే కేంద్రంలో తాను ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంటాననీ చెప్పింది. దీనికి కాంగ్రెస్ అధిష్టానం మమతను బుజ్జగించే ప్రయత్నం చేసింది. అయితే, మమత మాత్రం వినలేదు. తాను ఏదయితే డెడ్ లైన్ పెట్టిందో దానికే కట్టుబడి...కేంద్రానికి తాను ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంటున్నాననీ, వచ్చే శుక్రవారం నాడు తమ పార్టీకి చెందిన ఆరుగురు మంత్రులు వైదొలుగుతారనీ ప్రకటించింది.మంత్రులు వైదొలగడంతో పాటు, కేంద్రానికి తాను ఇస్తున్న మద్దతును కూడా ఉపసంహరించుకుంటున్నట్లు మమత ప్రకటించడంతో మన్మోహన్ ప్రభుత్వం మైనార్టీలో పడ్డదనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కేంద్రంలో సర్కార్ ఉండాలంటే 272మంది ఎంపీల బలం అవసరం. అయితే, మమతకు 19మంది ఎంపీలు ఉన్నారు. ఆమె కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకుంటే మన్మోహన్ బలం 254కు పడిపోతుంది.అంటే, మమత ఉపసంహరించుకుంటే మన్మోహన్ ప్రభుత్వం మైనార్టిలో పడ్డట్లేననీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూపీఏ సర్కార్కు మమత మద్దతు ఇస్తున్నప్పటికీ కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మమతను మన్మోహన్ సర్కార్ పట్టించుకోలేదనీ, అవమానం భరించలేకనే మమత యూపీఏ సర్కార్ నుంచీ వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. పేద ప్రజలపై మోయలేని భారం వేస్తున్న యూపీఏకు మమత వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఏం అవుతుందనే మెతక వైఖరిని కాంగ్రెస్ అవలంభించింది. దీనితో చేసేదేమీ లేక మమత తన మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. మమత యూపీఏకు మద్దతు ఉపసంహరించడంతో మన్మోహన్ తన ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో పడ్డారు.  ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ములాయం కూడా ఎప్పుడెప్పుడు ప్రధానమంత్రి సీట్లో కూర్చోవాలనీ చూస్తున్నారు. బయటకెళ్లి మద్దతు ఇస్తున్న మాయవతి కూడా మద్దతు ఇచ్చే విషయంలో అక్టోబర్ నెలలో నిర్ణయం తీసుకుంటాననీ ఇప్పటికే చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే ఇక ఎన్నో రోజులు కేంద్రంలోని యూపీఏ సర్కార్ అధికారంలో ఉండకపోవచ్చనీ కనిపిస్తోంది. అయితే, ఇప్పటికీ యూపీఏ సర్కార్ను నిలబెట్టే ప్రయత్నంలో కాంగ్రెస్ నేతలు నిమగ్నమైనారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: