సమైక్యవాదుల ఆశలను చల్లార్చిన జగన్

S. ShashiKanth
సమైక్యవాదుల ఆశలను జగన్ చల్లార్చారు. కాంగ్రెస్ పార్టీకి సిగ్గులేదని చెప్పేందుకే అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టామని చెప్పి అది విభజనను ఆపేందుకు కాదని పరోక్షంగా చెప్పారాయన. సమైక్యం కోసం మద్దతు కూడ గట్టేందుకు మాజి ప్రధాని దేవెగౌడను కలిసిన ఆయన అనంతరం విలేఖరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ఆంద్రరాష్ట్రం పట్ల ఎంత నిర్లజ్జగా వ్యవహారిస్తుందో దేశం మొత్తానికి చాటి చెప్పేందుకే అవిశ్వాస తీర్మాణం ప్రవేశ పెట్టామని అసలు విషయం చెప్పారు. అవిశ్వాసానికి మద్దతు కూడగొట్టి యూపిఏ ప్రభుత్వాన్ని కూల్చేసి రాష్ట్ర విభజనను ఆపేందుకు అవిశ్వాస తీర్మాణం ప్రవేశ పెట్టారు అని ఆశపడ్డ సమైక్యవాదుల ఆశలు జగన్ ప్రకటనతో తుస్సు మన్నాయి. ఇప్పటి దాకా ఎన్ని రకాలుగా కాంగ్రెస్ ను, సోనియాను ఘోరంగా అవమానించే విదంగా పనులు చేయలేదు, అయినా ఆమె రాష్ట్ర విభజనకు వెనుకడుగు వేయలేదు. అయినా సిగ్గులేదని జగనే చెప్పుతున్నారు కదా, ఇంకా ఏం చేసినా ఏం ప్రయోజనం విభజనపై సోనియా వెనక్కుపోదుకదా... అలాంటప్పుడు ఏంలాభం అంటున్నారు. అంటే జగన్ కు కాంగ్రెస్ పరువు తీయాలని ఉంది కాని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని లేదా ఏంటి అన్న అనుమానాలు అయితే దీంతో కలుగుతాయి అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పైగా దేవెగౌడను కలిసి ఆయన అడిగింది ఆర్టికల్ 3ని రద్దు చేసేందుకు, లేదా సవరించేందుకు సహకరించాలని. అది ఇప్పుడు చేస్తే విభజన ఎలా ఆగుతుంది. ఇంకా జగన్ చాలా విషయాలు చెప్పారు. సొంత పార్టీ ఎంపీలే అవిశ్వాసం పెట్టారంటే దేశ చరిత్రలో ఎక్కడా ఇప్పటి వరకు జరగలేదన్నారు. ఇంకా కాంగ్రెస్ కు సిగ్గులేదని చెప్పడానికి ఉదహరణ కావాలని ఆయన చెప్పారు. సరే దేవెగౌడ కూడా ఆర్టికల్ 3 పై చర్చించేందుకు సిద్దమని ప్రకటించారు. దీంతో జగన్ ఆయనను కలిసిన పర్పస్ సాల్వ్ అయినట్టే లెండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: