తాత్కాలిక విరామం ఇచ్చిన కేసీఆర్-దూసుకెళ్తున్న బైరెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ తాత్కలికంగా విరామం ఇచ్చినట్లు అగుపిస్తోంది. అయితే, రాష్ర్టాన్ని విడగొడితే సీమను ప్రత్యేక రాష్ర్టంగా చేయాలంటూ ప్రత్యేక సీమ ఉద్యమాన్ని తన నెత్తిన వేసుకున్న టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాత్రం దూసుకుపోతున్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు కోసమే ఉద్యమించినది టీఆర్ఎస్. గత పదకొండేళ్లుగా రాజీలేని పోరాటం చేస్తుంది.   కానీ, ఇటీవలి కాలంలో కొంత నిశ్శబ్దంగా ఉంటోంది. గత కొన్ని రోజుల కిందటనే ఆవిర్భవించిన రాయలసీమ హక్కుల పరిరక్షణ మాత్రం జోరు మీద ఉన్నది. సీమ పౌరుషాన్ని చూపెడుతామనీ బైరెడ్డి గర్జిస్తున్నారు. సీమను ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పాటు చేసే వరకు పోరాటం కొనసాగించడానికి బైరెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. అయితే, తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకోవడానికి బైరెడ్డి ప్రత్యేక సీమను తెరపైకి తెచ్చారనే వాదనలు ఉన్నాయి.  ఇదిలా ఉంటే, ఆగస్టు 20లోగా తెలంగాణపై కేంద్రం అనుకూల ప్రకటన చేయకుంటే రాష్ర్టంలో ప్రళయం స్రుష్టిస్తామన్నారు కేసీఆర్. కేసీఆర్ పెట్టిన డెడ్ లైన్కు వారం దాటింది. కేసీఆర్ మాత్రం దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. అయితే, తెలంగాణపై తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అది అసలుకే ఎసరు వస్తుందనీ భావించి మరికొన్ని రోజులు పాటు వాయిదా వేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.  తెలంగాణ ఉద్యమ భవిష్యత్ కార్యచరణను ఖరారు చేసేందుకు ఈ నెల 24,25,25తేదీల్లో పొలిట్ బ్యూరో సమావేశాలను నిర్వహిద్దామనుకుని వాటినికి కూడా సెప్టెంబర్ నెలకు వాయిదా వేసుకున్నారు. తెలంగాణపై కేంద్రం అనుకూలంగా ఉండటంతోనే కేసీఆర్ కొంత మౌనంగా ఉన్నారే తప్ప మరొకటి కాదనీ టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. రాష్ర్టంలోని కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండటంతో వాటిని చక్కబెట్టే కార్యక్రమంలో కాంగ్రెస్ అధిష్టానం తలమునకలై వుంది. ఈ పరిస్థితులు చక్కబెట్టిన తరువాత అంటే పార్లమెంటు సమావేశాలు ముగిసిన తరువాత కేంద్రం తెలంగాణపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే సంకేతాలు అందడంతోనే కేసీఆర్ ఈ నెలలో తలపెట్టిన ఉద్యమాన్ని సెప్టెంబర్ నెలకు వాయిదా వేసుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సెప్టెంబర్ 30న తెలంగాణ రాజకీయ జేఏసీ ఎలాగూ తెలంగాణ మార్చ్ కు పిలుపునిచ్చింది. అప్పటి దాకా ఆగి తెలంగాణ మార్చ్ తో ఉద్యమాన్ని ఉధ్రుతం చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమైనట్లు తెలుస్తోంది. దీనితోనే కేసీఆర్ కొన్ని రోజుల పాటు ఉద్యమానికి బ్రేక్ వేసుకున్నట్లు సమాచారం. బైరెడ్డి మాత్రం తన భవిష్యత్ కార్యచరణను ప్రకటించారు. మంచి ఊపు మీద ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: