బాబు మోడీని ఫుల్లుగానే వాయించెసినా ప్రజలకు కాలుతుంది!…ఎందుకు !

ఈ మద్య ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ విషయంలో అయినా ప్రధానమంత్రి నరేంద్రమోడీని గట్టిగానే విమర్శిస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఆయన భారత ప్రధాని అనే విషయం మరచిపోయారు. ప్రధానిపట్ల చూపవలసిన సభ్యత సమంస్కారం కనీసం ప్రొటొకాల్ కూడా మరచిపోయారు. అంటే నలభై సంవత్సరాల అనుభవం ఉండి కూడా దారి తప్పారు. అందుకే ఈయన కూడా ప్రతిపక్షాల్లో ప్రజలలో మరీ పలుచనై పోయారు.


సరే! అదనతా పక్కనబెట్టెసి తాజాగా రోజూచేసే ఆ పనిలో భాగంగా మళ్లీ మరోసారి మోడీ మీద విరుచుకుపడ్డారు. ఈ సారి చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే,  'ఏపీ - తెలంగాణల మధ్యన గొడవలకు కారణం మోడీనే..” అని బాబు తీవ్ర స్వరంలో విరుచుకుపడ్డారు.  ఈ సందర్భంగా అనేక అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని విమర్శించారు. 'ఐదేళ్లలో..' అంటూ చంద్రబాబు నాయుడు నరేంద్రమోడీని కడిగేశారు. 

నరేంద్ర మోడీ వ్యవహరించిన తీరు గురించి ప్రశ్నించారు. అమరావతి శంకు స్థాపనకు నరేంద్ర మోడీని ఆహ్వానిస్తే ఆయన మట్టి నీళ్లు ఇచ్చారంటూ అరిగిపోయిన రికార్డ్ ఏదు చేపల కథ ఆవుకథ అని తెలుగు రాష్ట్రాల్లో ప్రచారంలో ఉన్న చంద్రబాబు తీరు జనాలకు పునఃచ్చరణ తో విరుచుకుపడ్డారు.  ఏపీ - తెలంగాణల మధ్యన విభజన సమస్యల గురించి ఏరోజు పిలిచి మాట్లాడలేదు అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇంకా వివిధ అంశాలను ప్రస్తావిస్తూ నమో తీరును చంద్రబాబు నాయుడు ఏకేశారు. మోడీ మీద అసలే పీకల్దాకా కోపం మీదున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరోసారి ఇలా విరుచుకపడ్డారు.

చంద్రబాబు మాటలు బాగానే ఉన్నాయి కానీ, ఈయన మాటలు వింటే ప్రజలకూ కొన్ని సందేహాలు ప్రవాహంలాగా వస్తాయి వస్తున్నాయి.  నిజమే మోడీ తీరు బాగా లేదు. అమరావతికి మట్టి - నీళ్లు తెచ్చివ్వడం - ఏపీ-తెలంగాణ ల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి మోడీ చొరవ చూపకపోవడం ఇవన్నీ మోడీ తప్పిదాలే అనుకుందాం. అయితే చంద్రబాబు నాయుడు అప్పుడే ఈ అంశాల గురించి మాట్లాడాల్సింది! అప్పుడు నవరంధ్రాలు మూసుకొని ఇప్పుడు అంతా అయ్యాక మాట్లాడటమేమిటి. ఫ్రజలకు ఎందుకు పదే పదే పనికి రాని ఈ సోది అంటున్నారు విశ్లేషకులు. 

అమరావతికి  నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి నీళ్లు-మట్టి తెచ్చి ఇచ్చినప్పుడు అనేక మంది విమర్శలు చేశారు. ఏపీలో వైసీపి తో సహా ఇతర ప్రతిపక్షాలు, ప్రజలు అనేక మంది విరుచుకుపడ్డారు కూడా. ఇలా మట్టి - నీళ్లు తెచ్చివ్వడానికా అంటూ తీవ్రమైన విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా అనేక మంది అప్పుడు నిప్పులు చెరిగారు! అయితే అప్పుడు నారా చంద్రబాబు నాయుడు నోరు విప్పలేదు! మట్టి - నీళ్లను మాత్రమే మోడీ తెచ్చారేంటి అని అంతా అనుకుంటున్నా ఛంద్ర బాబు మాత్రం మారు మాట్లాడలేదు. అదో సెంటిమెంట్ అన్నట్టుగా చంద్ర బాబు ఆనాడు నమోకి కవరింగ్ చేశారు. మోడీ చేసింది అంతా మంచిదే అని ఛంద్ర బాబుకు అప్పుడు అనిపించింది.

ఇక రెండు రాష్ట్రాల మధ్యన సమస్యలు ఉన్నట్టుగా కూడా చంద్రబాబు నాయుడు అప్పుడు మాట్లాడలేదు! అప్పుడు కేసీఆర్ తో చంద్రబాబు చట్టాపట్టాలేసుకుని తిరిగారు. అమరావతికి పిలిపించుకున్నారు. సత్కారాలు సన్మానాలు చేశారు.  తెలుగుదేశం వాళ్ల ఇళ్లలో పెళ్లికి కూడా కేసీఆర్ ను పిలిపించు కున్నారు. అప్పుడు అంతా బాగానే అనిపించింది. ఇప్పుడే చంద్రబాబుకు ఏవేవో ఎందుకు గుర్తుకు వస్తున్నాయి. వాటి విషయంలో నరేంద్రమోడీని నిందిస్తూ ఉన్నారు! అందరూ మాట్లాడిన టైమ్ లో అన్నీ మూసుకున్న చంద్రబాబు ఏప్పుడూ గతంలో మాట్లాడలేదు. ఇప్పుడేమో ఈయన అస్సలు ఆపడం లేదు! దీని వల్ల ప్రయోజనం ఏమిటో చంద్రబాబుకే తెలియాలి. ప్రజల్లో పలుచనయ్యే ఈ  రాజకీయం ఎందుకు?  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: