50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు కేసు - విచారణకు సుప్రీంకోర్ట్ అంగీకారం

125 కోట్ల ప్రజానీకం నూరు కోట్ల ఓటర్లున్న భారత్ లో ఎన్నికల ప్రక్రియ సంక్లిష్ట నుండి సులభంగా మార్చటంకోసం, ఎన్నికల్లో రిగ్గింగ్, పోలింగ్ కేంద్రాల దురాక్రమణ వాటి భారీ నుండి తప్పించేలా ఎన్నికలను నిర్వహించటానికి "ఎలెక్ట్రానిక్ ఓటింగ్" విధానం ప్రవేశ పెట్టారు. ఇంతవరకు ప్రజల్లో ఓటెసిన వారెవరికి లేని అనుమానం ప్రధాని పీఠం నుంచి మోడీని దింపేయాలని కోరుకునే వారికి, ఎన్నికల్లో ఓడిపొగలమన్న అనుమానం ఉన్నవారి ఆక్రందన తీర్చటానికి సుప్రీం కోర్ట్ ఈ విచారణకు అంగీకరించి ఉండవచ్చు. 

లోక్‌ సభ ఎన్నికల ఫలితాల్లో భాగంగా 50 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని 21 పార్టీలు వేసిన రివ్యూ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు అంగీకారం తెలిపింది. ఈ అంశంపై త్వరగా విచారణ జరపాలని ప్రతిపక్షాల తరఫు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావించారు. ఈ పిటిషన్‌ పై వచ్చే వారం విచారణ జరగనుంది.

ఇప్పటికే ఈ అంశంపై దేశం లోని 21 పార్టీలు కలిసి సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ప్రతి నియోజక వర్గంలో ఐదు వీవీప్యాట్‌ స్లిప్పులను ఈవీఎంలతో సరిపోల్చాలని తీర్పు నిచ్చింది. వీవీప్యాట్లలో 50% స్లిప్పులు లెక్కించడం వల్ల సమయం, సిబ్బంది ఎక్కువ అవసరమవుతాయని దీని వల్ల ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టు లో అఫిడవిట్‌ దాఖలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రతిపక్షాలకు ఊరట కలిగించేలా ఐదు వీవీప్యాట్‌లను లెక్కించాలని నిర్ణయించినప్పటికీ గతనెలలో ప్రతిపక్షాలు దీనిపై రివ్యూ పిటిషన్‌ వేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: