రెంటికి చెడ్డ రేవడిగా మారిపోతున్న చంద్రబాబు!

అవకాశవాదం, అబద్ధాలు, అపనిందలు, అహంభావం, అహంకారం ఈ ఐదు ఒక రాజకీయ నాయకునికి పంచప్రాణాలుగా ఉంటే అతనికి పతనం ప్రారంభమైనట్లే. ఇవన్నీ మనం నేటితరం రాజకీయ నాయకుల్లో తరచుగా గమనిస్తూనే ఉన్నాం. అయితే అవి ఎదటివారు గుర్తించేంతవరకే వారు రాజకీయాల్లో చక్రం తిప్పుతారు. ఎదుటివారు గుర్తిస్తే మాత్రం వంటింట్లో పొత్రం తిప్పాల్సిందే. 


తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం స్నేహం చేసి గెలిపించిన బిజేపికి టోపీపెట్టి ఆ పార్టీపై తనచేతకాని తనాన్ని ఒక నెపంగా మార్చి బిజేపిపై నెట్టేసి తన తీరుతో ఇప్పటికే ఎన్డీయేకు దూరం అయ్యారు. బాబు  ఒక అవకాశవాది అని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారు. తమ పార్టీతో నాలుగున్నరేళ్ల పాటు కొనసాగి తన కేబినెట్లో తెలుగుదేశం మంత్రులను నాలుగున్నరేళ్ల పాటు కొనసాగించి తీరా ఎన్నికలు దగ్గర పడ్డాక  తమ మీద ధ్వజమెత్తుతూ చంద్రబాబు నాయుడు బయటకు వెళ్లడానికి నరేంద్ర మోడీ అమిత్ షాలు అంత తేలికగా తీసుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు విషయంలో వారు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఒకవేళ చంద్రబాబు అవసరం వారికి ఏర్పడకపోతే, మళ్లీ బీజేపీ ప్రభుత్వంవస్తే చంద్రబాబుకు వారు చుక్కలు చూపే అవకాశాలు లేకపోలేదు. చంద్రబాబు ప్రదర్శించిన అవకాశవాదం అలాంటిది మరి!


కేవలం ఎన్డీయేలోనే  కాదు, తాజాగా  కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబు తీరుపై ఒకింత ఆగ్రహంతో ఉన్నారని పక్కా సమాచారం. చంద్రబాబు నాయుడు  తన తీరుతో రాహుల్ గాంధి నే ఇబ్బంది పెడుతున్నాడని ఆయన కోటరీ భావిస్తోందట. ఇటీవలే మహారాష్ట్ర రాజకీయ నేత శరద్ పవార్ మాట్లాడుతూ 'చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి పదవికి తగిన వ్యక్తి' అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 'మమతా బెనర్జీ మాయవతి చంద్రబాబు..' అంటూ రాహుల్ గాంధికు ప్రత్యామ్నాయంగా పేర్లను చెప్పాడు   శరద్ పవార్. 


చంద్రబాబు తీరు తెలిసిన సోనియా గాంధి చంద్రబాబును ఓ కంట కనిపెడుతూనే ఉన్నారని సమాచారం. ప్రధానిగా గతంలో రాహుల్ గాంధి, మాయావతి, మమత బెనర్జీ పేర్లే విబిపిస్తూ ఉండేవి అందరినోట. అయితే చంద్రబాబే శరద్ పవార్ నోట రాహుల్ గాంధి పేరుకు బదులు తన పేరు చెప్పించారని కాంగ్రెస్ పసి గట్టిందట. అయితే అది పవార్ అభిప్రాయం మాత్రంకాదని చంద్రబాబు నాయుడే పవార్ చేత తనకు అనుకూలంగా మాట్లాడింపజేసి ఉంటారని రాహుల్ గాంధి కోటరీ అభిప్రాయపడు తుందని సమాచారం. అసలే రాహుల్ గాంధీని నాయకుడిగా ప్రొజెక్ట్  చేసుకోవడంలో ఆయన కోటరీ మీడియా రెండూను చాలా కష్టపడుతూ ఉంటాయి. 


ఇలాంటి తరుణంలో చంద్రబాబు నాయుడు ఇలా కుట్రలు చేస్తూ ఉన్నారని ఇదంతా రాహుల్  గాంధి బృందం గమనిస్తూనే, వివరిస్తూనే ఉందట. అయితే ప్రస్తుతానికి స్పందించే అవకాశం లేదని తెలుస్తోంది. ఎన్నికలు అయిపోతే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంశాన్ని బట్టి రాహుట్ గాంధి  కోటరీ సరైన తీరులో స్పందించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట. ఎలాగూ ఏపీలో చంద్రబాబు నాయుడు పార్టీ పెద్దగా సీట్లను నెగ్గే  అవకాశాలు కనిపించడం లేదు. అప్పుడు అదునుచూసి చంద్రబాబు నాయుడి కుతంత్రాలకు చెక్ పెట్టాలని వారు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: