బాహుబలి ప్రభాస్‌ కు భూ వివాదంలో ఊరట: తెలంగాణా హైకోర్ట్

తెలంగాణా అధికారులు ఉద్యోగులు ప్రజల పట్ల మితిమీరిన నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని జనాంతికం. అది నిజమేనన్నట్లు ప్రఖ్యాత సినీ హీరో ప్రభాస్ భూమి విషయంలో వారు ప్రవర్తించిన తీరు జనంలో వారి ప్రతిష్టను నేలకి లాగింది.  నిర్లక్ష్యంతో ఇంటర్ బోర్డ్ పలితాలను ప్రకటించి 16 మంది అమాయక విద్యార్ధుల మరణానికి కారణమైనది. ఇలా వీరి లీలలు అనంతం.  

రంగారెడ్డి జిల్లా రాయ్‌దుర్గ్‌ పన్మక్త గ్రామంలో కొనుగోలు చేసిన భూమి విషయంలో ప్రభాస్‌కు హైకోర్టు ఊరట యిచ్చింది. ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న వందల ఎకరాల భూ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టే దిశగా కోర్టు పలు సూచనలు చేసింది. ప్రభాస్‌ స్వాధీనంలో ఉన్న భూమి నుంచి ఖాళీ చేయించడం చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది. ఈ విషయంలో ప్రభుత్వం చట్టం నిర్దేశించిన విధి విధానాలను అనుసరించలేదని స్పష్టం చేసింది. 

1958 నుంచి ఇక్కడి భూములపై వివాదం నడుస్తున్న నేపథ్యంలో తిరిగి ఆ భూమిని ప్రభాస్‌కు స్వాధీనం చేయాలని ఆదేశించలేమని కూడా చెప్పింది. అయితే ఈ వివాదం ముగించటానికి సూచనలు చేయటం ముదావహం.  అయితే ప్రభాస్ కు రాయదుర్గ్ పాన్ మక్తాలో గల 2,083 చదరపు గజాల భూమిని, అతిథి గృహాన్ని తనకు తిరిగి అప్ప గించడానికి హైకోర్టు తిరస్కరించింది. అయితే, భూమిని స్వాధీనం చేసుకునే విషయంలో ఎనిమిది వారాల్లోగా ప్రభాస్ ముందుగా పెట్టుకున్న దరఖాస్తుపై నిర్ణయం తీసుకో వాలని జస్టిస్ వి. రామసుబ్రహ్మణ్యన్, జస్టిస్ పి.కేశవరావులతో కూడిన డివిజన్ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ప్రభాస్ అలియాస్ ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఆ భూమి సిఎస్-7 లిటిగేషన్ జోన్ లో ఉందని తేల్చింది. అయితే, భూమిని స్వాధీనం చేసుకోవడంలో రెవెన్యూ అధికారులు తగిన ప్రక్రియను అనుసరించలేదని, బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని అభిప్రాయ పడింది.

ప్రభాస్‌ దరఖాస్తు విషయంలో జారీ చేసే ఉత్తర్వుల ఆధారంగా ఈ వందల ఎకరాల భూమిపై యాజమాన్య హక్కులు కోరుతున్న మిగిలినవారు కూడా అదే రీతిలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని హైకోర్టు తెలిపింది. ప్రభాస్‌ పెట్టుకున్న దరఖాస్తును ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీచేస్తే, ఆ భూమి అతని స్వాధీనమవుతుందంది. ప్రభుత్వం అతని దరఖాస్తును తిరస్కరిస్తే అతను కోర్టును ఆశ్రయించవచ్చునని తెలిపింది. 

భూమి ఎవరి స్వాధీనంలో ఉందో వారు రిజిస్టర్‌ సేల్‌-డీడ్ల ద్వారా ఆ భూములపై సంక్రమించిన హక్కులను వదులుకుని, ప్రభుత్వం నిర్ణయించిన క్రమబద్దీకరణ ఫీజు చెల్లిస్తే, అప్పుడు ప్రభుత్వం ఆ భూములను క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని హైకోర్టు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: