వాయిదాలో జిమ్మిక్కుందా!

Kuthuru RajiReddy
టిఆర్ఎస్ తలపెట్టిన మేధో మధన కార్యక్రమం వాయిదా పడింది. నేటి నుండి మూడు రోజుల పాటు పార్టీ కీలక నేతలతో జరుగాల్సిన సమావేశం వాయిదా పడడం వెనుక టిఆర్ఎస్ అధ్యక్షులు కెసిఆర్ జిమ్మిక్కులు ఉన్నాయా, లేదా మరేమైనా కారణాలున్నాయా అంతుచిక్కడం లేదు. టిఆర్ఎస్ నాయకులు విధ్యుత్ ఉద్యమంలో పాల్గొంటుండంతో పార్టీ సమావేశాలను వాయిదా వేశామని, త్వరలోనే నిర్వహిస్తామని కొంత మంది టిఆర్ఎస్ నాయకులు చెబుతున్నప్పటికిని ఎంత వరకు నిజమనేది అంతుచిక్కని విషయంగానే ఉంది. తెలంగాణ పోరుయాత్ర పేరిట సిపిఐ తెలంగాణ ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించనుండడంతో పాటు బిజెపి సైతం తెలంగాణ కోసం తెలంగాణ ప్రాంతంలో పర్యటించనుంది. కాగా ఈ రెండు పార్టీలు తల పెట్టిన ఉద్యమాలకు తెలంగాణ జెఎసి మద్దతు పలికింది. కాగా జెఎసి ఆధ్వర్యంలో సెస్టెంబర్ 30న తల పెట్టిన హైదరాబాద్ మార్చ్ ను విజయవంతం చేయడం కోసం కృషిచేస్తామని సిపిఐ, బిజెపి పార్టీలు జెఎసికి హామీనిచ్చాయి. ఇదంతా జరిగినప్పటికిని తాము మద్దతునిస్తామని టిఆర్ఎస్ ఏనాడు ప్రకటించలేదు. ఇవన్ని పరిణామాలు జరుగుతుండగానే టిఆర్ఎస్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా ప్రకటించిన నిర్ణయంలో ఏ మార్పులు సంభవించాయో తెలియదుగాని విరమించుకుంటున్నట్లు తెలియజేసింది. అయితే జెఎసి చైర్మన్ కోదండరామ్, టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ల మద్యన వైరుధ్యాలు ఏర్పడ్డాయని ప్రచారం జరిగింది. ఇటువంటి పరిస్థితిలో కోదండరామ్ ను టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఒంటరిగా చేయాలనుకున్నారో తెలియదు గాని వేటిని పట్టించు కోకుండా కోదండరామ్ ఉద్యమంలో ముందుకు వెళ్తున్నాడు. తామే తెలంగాణ ఉద్యమం, ఉద్యమమంటేనే తాముగా టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ బావిస్తుండగా బిజెపి, సిపిఐలు సైతం తెలంగాణ కోసం పోరును ఉదృతం చేశాయి. దీంతోపాటు జెఎసి తలపెట్టిన హైదరాబాద్ మార్చ్ ను తలపెట్టడంతో పాటు తెలంగాణ కోసం కల్సి వచ్చే అన్ని పార్టీలను కలుపుకొని వెళ్లడం కోసం ప్రయత్నాలు చేస్తుంది. అయితే జరుగుతున్నటువంటి పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనని బావించిన టిఆర్ఎస్ లో కొంత మంది నాయకులు జెఎసి చైర్మన్ కోదండరామ్, టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ మద్యన ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించి వారి మద్యన సమన్వయాన్ని గతం మాదిరిగానే కొనసాగే విధంగా కృషిచేస్తున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరి మద్యన ఏర్పడిన వివాదం పరిష్కరించబడితే జెఎసి తల పెట్టిన హైద్రాబాద్ మార్చ్ కు టిఆర్ఎస్ మద్దతిచ్చే అవకాశాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: