ప్రియాంక రాజకీయ ప్రవెశం పై నరేంద్ర మోడీ వ్యాఖ్యలు షాకింగ్!

ప్రియాంక గాంధి వాధ్రా ఇప్పటి వరకు కాంగ్రెస్ అమ్ములపొది లో ఉన్న వాడని అస్త్రం. అయితే కాంగ్రెస్ కు ఇప్పుడు చావో? రేవో? తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ కు ఒకనాడు ఇందిర మరణించి ప్రాణం పోసింది. ఆ తరవాత రాజీవ్ మరణం అదేపని చేసింది. అయితే ఆ తరవాత కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రధాని పదవిని వాళ్లు అనుభవించలేక పోయారు. ఇప్పుడు నెహౄ, గాంధిల పేరుచెప్పుకొని ఆ కుటుంబ సభ్యులుగా చలామణి అవుతూ గత ఏడు దశాబ్ధాలుగా దేశంలో అధికారం అనుభవిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇక ప్రియాంకను గాంధి గానే పరిచయం చేస్తారులా ఉంది. ప్రియాంక భర్త రాబర్ట్ వాధ్రా చరిత్ర సమస్థం పరపీడన పరాయణత్వం అంటారు. అది వాడేసి ప్రతిపక్షాలు ఆటాడుకోవా!    

ఏదైతే అదైందని  కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ ప్రత్యేక్ష రాజకీయాల్లోకి తీసుకు రావడం జరిగింది. అయితే దానిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా స్పందించారు. బుధవారం ఆయన మహారాష్ట్ర బీజేపీ కార్యకర్తలతో  ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ప్రియాంక రాజకీయ ఎంట్రీపై పరోక్షంగా విమర్శలు చేశారు. కొందరికి కుటుంబమే పార్టీ అని, అయితే బీజేపీకి మాత్రం పార్టీయే కుటుంబమని చెప్పారు. దీని తాత్పర్యం ఏమంటే ఎవరో ఒకరు ఆ కుటుంబం నుండి రాజకీయాల్లోకి రాకపోతే కాంగ్రెస్ కు బ్రతుకు లేదు. 


మన పార్టీలో ఎలాంటి నిర్ణయాలు అయినా ఒకే కుటుంబం తీసుకోదు. అందరితో చర్చించి ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటాం. ఒక్కరి ఆలోచన విధానాలపై పార్టీనిర్ణయాలు ఉండవు. మన పార్టీకి కార్యకర్తలే కుటుంబం. కొందరికి కుటుంబంమే పార్టీ. బీజేపీ ప్రజాస్వామ్య విలువలను పాటిస్తుంది. మన పార్టీని కార్యకర్తలతో నిర్మించుకున్నాం. ఎలాంటి నిర్ణయాలు అయినా అందరం కలిసి తీసుకుంటాం. భారతీయ జనతా పార్టీ దేశానికి అంకితం. దేశంలో ప్రజాస్వామ్య విలువలను పాటించే పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీయే అని మోదీ చెప్పు కొచ్చారు. 

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించిన సంగతి తెలిసిందే. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు తూర్పు యూపీ ప్రచార బాధ్యతలను కూడా అప్పగించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: