సీఎంకు ‘ధర్మ’ సంకటం

murali
మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామాను ఆమోదించాలా వద్దా ఆమోదిస్తే కాంగ్రెస్ నాయకుల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఆమోదించపోతే అధిష్ఠానం నుంచి చివాట్లు ఎదుర్కోవల్సి ఉంటుంది. మంత్రి ధర్మాన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. ధర్మాన రాజీనామా ఆమోదించవద్దని కొందరు మంత్రులు సీఎంపై ఒత్తిడి పెంచుతున్నారు. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో వాన్ పిక్ కేసులో మంత్ర ధర్మాన ప్రసాదరావుపై సీబీఐ చార్జీషిట్ చేసిన నేపథ్యంలో .ఆయన తన పదవికి రాజీనామా చేసి లేఖను నేరుగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి అందజేసిన విషయం విధితమే. దీనిపై సీఎం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటీవలే ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని ముగించుకుని వచ్చిన కిరణ్ ను మంగళవారంనాడు ఆయన క్యాంపులో పలువురు మంత్రులు ధర్మాన రాజీనామాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించవద్దని కోరినట్లు సమాచారుం. అంతేకాకుండా ధర్మానా రాజీనామాను ఆమోదించాలని, ఈ వ్యవహారాన్ని ఢిల్లీ వరకు తేవద్దని ఇప్పటికే సీఎంకు అధిష్ఠాం సూచించింది. ఆమోదిస్తే మంత్రుల్లో చులకన భావం ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో కిరణ్ కు ముందు నుయ్యి. వెనక గొయ్యి అన్న చందంలా మారింది. గత నాలుగైదు రోజులుగా అధికార నివాసానికే పరిమితమైన ధర్మానా పలువురు మంత్రులు సంఘీ భావం ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా ధర్మానా పీసీసీ బొత్సను పలుమార్లు కలిసి వాన్ పిక్ కేసుకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతున్న ధర్మాన, నైతికి విలువకు కట్టుబడి రాజీనామా చేస్తున్నాని ఢిల్లీ నుంచి వచ్చిన రోజు మీడియా స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో రాజీనామా ఆమోదించే విషయంలో ముఖ్యమంత్రి కిరన్ కొంత ఇరుకున పడినట్లు తెలుస్తోంది. అయితే ధర్మాన రాజీనామాపై అధిష్ఠానంతో కలిసి చర్చించాలని కొందరు మంత్రులు సీఎంను కోరుతున్నప్పటికీ అధిష్ఠానం ఇచ్చిన ఆదేశాలతో సీఎం ఆ దిశగా ఆలోచించడం లేదని తెలుస్తోంది. అధిష్ఠానం ఆదేశాల మేరకు రాజీనామా ఆమోదిస్తే, సీఎంకు కొందరు నేతల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని పార్గీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉండగా ధర్మాన రాజీనామాపై సీఎం వెంటనే నిర్ణయం తీసుకోవాలని, ప్రతిదానికి అధిష్ఠానం అంటే ఎలా అని పార్టీ సీనియర్ నేత విహెచ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఇటు పార్టీలోనూ, అటు మంత్రి వర్గంలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: